News January 28, 2025
Income Tax లేని దేశాలకు డబ్బెలా వస్తుందంటే..

ప్రపంచంలో Income Tax లేని దేశాలు, ప్రాంతాలు 16 వరకు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా వెస్ట్ ఏషియా, ఆఫ్రికా ప్రాంతాలే ఉన్నాయి. అక్కడ ఇబ్బడిముబ్బడిగా చమురు నిల్వలు ఉండటంతో ప్రభుత్వ, రాజుల ఖజానాలకు డబ్బు దండిగా వస్తుంది. కొన్నేమో VAT, కార్పొరేట్, ప్రాపర్టీ ట్యాక్సులు, స్టాంప్ డ్యూటీ, టూరిజం, సహజ వనరుల ద్వారా ఆదాయం ఆర్జిస్తాయి. ఆయా దేశాల్లో పౌరసత్వం కావాలంటే భారీ డిపాజిట్లు, పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.
Similar News
News December 4, 2025
పుతిన్ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నారు: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ మధ్య పీస్ ప్లాన్‌పై నిన్న రష్యాలో అమెరికా ప్రతినిధి బృందం చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పుతిన్ యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నారని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ‘పుతిన్‌తో జారెడ్ కుష్నెర్, స్టీవ్ విట్కాఫ్ సమావేశం బాగా జరిగింది. అయితే ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. పుతిన్ యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నట్లు వారిద్దరూ అభిప్రాయపడ్డారు’ అని అన్నారు.
News December 4, 2025
2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. అప్లై చేశారా?

RRBలో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు ఈ నెల 10 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు DEC 12వరకు చెల్లించవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, B.Sc ఉత్తీర్ణులై, 18- 33 ఏళ్ల మధ్య ఉండాలి. స్టేజ్ 1, స్టేజ్ 2 రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. www.rrbcdg.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 4, 2025
భారీ జీతంతో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలు

<


