News April 29, 2024
IPL ఫ్రాంచైజీలకు ఆదాయం ఎలా వస్తుందంటే?

IPL టీమ్ ఓనర్లకు చాలా రకాలుగా ఆదాయం వస్తుంది. టైటిల్ స్పాన్సర్ సంస్థ ఏడాదికి ₹500 కోట్లు చెల్లిస్తే అందులో 50% బీసీసీఐ, మిగిలినది ఫ్రాంచైజీలు తీసుకుంటాయి. అలాగే స్పాన్సర్లు క్రెడ్, డ్రీమ్11 లాంటివి, బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు చెల్లించే మొత్తంలోనూ సగం టీమ్ ఓనర్లకే వెళ్తుంది. జెర్సీలపై ఉండే లోగోలకు టీమ్ బ్రాండ్‌ను బట్టి ఆదాయం వస్తుంది. హోమ్ గ్రౌండ్ టికెట్లపై వచ్చే ఆదాయంలో 80% ఫ్రాంచైజీలకే వెళ్తుంది.
Similar News
News December 9, 2025
జామపండు తింటే ఎన్నో లాభాలు!

మార్కెట్లో విరివిగా లభించే జామపండును పోషకాల పవర్ హౌస్ అని పిలుస్తారు. ఇది నారింజ కంటే 4 రెట్లు అధికంగా విటమిన్ C అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉన్న పీచుపదార్థం చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. కేవలం 60-70క్యాలరీలు మాత్రమే ఉండటం వల్ల బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. దేశీయ సూపర్ ఫ్రూట్ అయిన జామను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. share it
News December 9, 2025
ఘోర అగ్నిప్రమాదం.. 20 మంది మృతి

ఇటీవల తుఫాన్ బీభత్సంతో అతలాకుతలమైన ఇండోనేషియాలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. రాజధాని జకార్తాలో ఓ ఏడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగి 20 మంది మరణించారు. మరికొంత మంది గాయపడ్డారు. ఏరియల్ సర్వే కోసం ఉపయోగించే డ్రోన్ల తయారీ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో మొదలైన మంటలు వెంటనే భవనమంతా వ్యాపించాయి. ఆ సమయంలో కొందరు ఉద్యోగులు భోజనం చేస్తున్నారు. మంటలు చుట్టుముట్టడంతో వారంతా సజీవదహనం అయ్యారు.
News December 9, 2025
మొదటి విడత ప్రచారానికి తెర

TG: పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి తెరపడింది. తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈనెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తర్వాత ఫలితాలు వెలువడతాయి. మొదటి విడతలో 4,235 గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. 56,19,430 మంది ఓటు వేయనున్నారు. వీరి కోసం 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.


