News February 25, 2025
టెన్త్ మార్కులు ఎలా ఇద్దాం?.. విద్యాశాఖ కసరత్తు

TG: ఈ ఏడాది నుంచి టెన్త్ మార్కుల విధానం మారనుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న గ్రేడింగ్ విధానాన్ని ఎత్తివేయగా ఆ స్థానంలో దేన్ని అమలు చేయాలనే దానిపై విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్కులను బట్టి పాస్, ఫెయిల్ అని ఇవ్వాలా? లేక ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కేటగిరీలుగా ఇవ్వాలా? అని నిన్నటి సమావేశంలో చర్చించారు. అయితే ఎటూ క్లారిటీ రాకపోవడంతో త్వరలో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.
Similar News
News February 25, 2025
పెళ్లై ఏడేళ్లు.. ఒకే కాన్పులో ముగ్గురు జననం

TG: గజ్వేల్ సమీపంలోని అడవిమజీద్‌కు చెందిన మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. నర్సింహులుతో నాగరత్నకు వివాహమవ్వగా ఏడేళ్లుగా పిల్లలు కలగలేదు. ఈ క్రమంలో ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకోగా గర్భం దాల్చింది. ఆదివారం ఆమెకు గజ్వేల్ ఆసుపత్రిలో ప్రసవం జరగగా ఇద్దరు మగ, ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
News February 25, 2025
శివరాత్రికి ముస్తాబవుతున్న శివాలయాలు

శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం వేడుకకు ముస్తాబైంది. 1500 మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. శ్రీశైలంలో బ్రహ్మోత్సవ సన్నాహాలను మంత్రి ఆనం పరిశీలించారు. ఆలయ నిర్వాహకులు ఉచిత లడ్డూ పంపిణీ చేస్తున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది.
News February 25, 2025
‘ఛావా’ కలెక్షన్ల దండయాత్ర

బాక్సాఫీస్ వద్ద ‘ఛావా’ మూవీ దండయాత్ర కొనసాగుతోంది. విడుదలైన 11 రోజుల్లో ఈ సినిమా భారతదేశంలో రూ.353.61 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. నిన్న ఒక్క రోజే రూ.20 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు వెల్లడించాయి. మరాఠా యోధుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ లీడ్ రోల్‌లో నటించారు.