News October 4, 2025
ఈ-క్రాప్ ఎలా నమోదు చేస్తారు? ఎందుకు ముఖ్యం?

AP: ఈ-క్రాప్ నమోదులో భాగంగా వ్యవసాయ సిబ్బంది.. రైతు ఆధార్, ఫోన్ నంబర్, సర్వే నంబర్‌తో పాటు పొలం వద్ద రైతుల ఫొటోలు తీసి ఈ-పంట యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. పొలం గట్ల మీద సాగు చేసే పంటలు, చెట్లను కూడా ఈ క్రాపింగ్ చేస్తారు. పంట నమోదు చేశాక e-KYC చేస్తారు. ఇది పూర్తైన వారికే పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ వర్తిస్తుంది. అలాగే ఈ-క్రాప్‌లో నమోదైన రైతుల నుంచే ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తుంది.
Similar News
News October 4, 2025
అమెరికాలో 2.3 కోట్ల మంది మిలియనీర్లు!

ప్రపంచంలో అత్యధిక మిలియనీర్లు అమెరికాలో ఉన్నట్లు ‘UBS గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2025’ తెలిపింది. అక్కడ ఏకంగా 2.3 కోట్ల మంది మిలియనీర్లు ఉన్నట్లు పేర్కొంది. ఆ తర్వాత చైనా (63లక్షలు), ఫ్రాన్స్ (29లక్షలు) ఉన్నాయి. ఈ జాబితాలో భారతదేశం 9.17 లక్షల మంది మిలియనీర్లతో 14వ స్థానంలో నిలిచింది. జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ కూడా మొదటి 15 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.
News October 4, 2025
ఆ కాఫ్ సిరప్‌ల తయారీ ఆపేయండి: ప్రభుత్వం

పలువురు పసిపిల్లల మరణానికి కారణమైన కాఫ్ <<17905875>>సిరప్‌లు<<>> కల్తీవేనని TN ఫుడ్ సేఫ్టీ, DRUG ADMIN DEPTలు తేల్చాయి. చెన్నై సమీపంలో ఉన్న సిరప్ తయారీ పరిశ్రమలో అవి తనిఖీలు నిర్వహించాయి. ఇక్కడ తయారయ్యే కోల్డ్రిఫ్ తదితరాలపై నిషేధం విధించడంతో వాటి ఉత్పత్తిని నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. మార్కెట్లో ఉన్న స్టాక్‌ను వెనక్కు రప్పిస్తున్నట్లు తెలిపారు. MP, రాజస్థాన్‌లలో 11 మంది పిల్లలు మరణించడం తెలిసిందే.
News October 4, 2025
PHOTO: కొత్త లుక్‌లో సీఎం చంద్రబాబు

AP: CM చంద్రబాబు నిత్యం ఒకే కలర్ ప్యాంట్, చొక్కానే ధరిస్తారు. వేరే దుస్తుల్లో కనిపించడం అరుదు. ఎప్పుడో ఒకసారి పండగల సమయంలో పంచెలో కనిపిస్తుంటారు. అయితే ఇవాళ ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమంలో సీఎం కొత్త లుక్ ఆకట్టుకుంది. ఆటో డ్రైవర్ షర్ట్ వేసుకొని ఆటోవాలాలు, టీడీపీ శ్రేణుల్లో ఆయన జోష్ నింపారు. దీంతో CBN ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్, లోకేశ్ కూడా ఆటో డ్రైవర్ చొక్కాలు ధరించారు.