News August 5, 2024

మెదడులో చిప్.. ఎలా పనిచేస్తుంది?

image

బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్(BCI) కలిగిన N1 అనే చిప్‌ను మనిషి పుర్రెలో అమరుస్తారు. ఇది 8MM వ్యాసం ఉంటుంది. చిప్‌లోని 3వేలకు పైగా ఎలక్ట్రోడ్లను మెదడులోని ముఖ్యమైన భాగాల్లో ప్రవేశపెడతారు. ఇవి న్యూరాన్లలో ప్రసారమయ్యే మెసేజ్‌లను చిప్‌నకు పంపుతాయి. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గారిథమ్‌లుగా BCI మారుస్తుంది. మెదడు, వెన్ను సమస్యలు ఉన్నవారికి కొత్త జీవితం ఇచ్చేందుకు న్యూరాలింక్ పనిచేస్తోంది.

Similar News

News March 7, 2026

మెదడును చురుగ్గా పనిచేయించే ‘కోకో’

image

కోకో తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిలోని ఫ్లావనాల్స్ రక్త ప్రసరణను మెరుగుపరిచి, మెదడుకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. ఫలితంగా ఏకాగ్రత పెరగడం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, మానసిక అలసట తగ్గుతుందని పేర్కొన్నారు. రోజుకు 3 చెంచాల కోకో పౌడర్‌ను పాలు/ నీటిలో కలుపుకుని తాగితే మెదడు మరింత చురుగ్గా మారుతుందని సూచిస్తున్నారు. డార్క్ చాక్లెట్‌లోనూ కోకో ఉంటుంది.

News March 7, 2026

ఇరాన్‌లో మరోసారి భూకంపం

image

US, ఇజ్రాయెల్ దాడులతో అట్టుడుకుతున్న ఇరాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రత నమోదైంది. బందర్ అబ్బాస్‌కు 74 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు US జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈనెల 3న కూడా గెరాష్ నగర సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో <<19288652>>భూకంపం సంభవించడం<<>> తెలిసిందే.

News March 7, 2026

హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్

image

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటు చేయనుంది. 30వేల చ.అడుగుల ఈ ఆఫీస్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఈ నెల 12న ప్రారంభించనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌కు ఇప్పటికే ముంబైలో కార్యాలయం ఉండగా భారత్‌లో ఇది రెండోది కానుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ రాకతో HYDలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ సెక్టార్లు బలోపేతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.