News September 13, 2025

పశువుల్లో గాలికుంటు వ్యాధి ఎలా వస్తుందంటే?

image

వైరస్ ద్వారా వ్యాపించే గాలి కుంటువ్యాధి పశువుల్లో ప్రమాదకరమైనది. వర్షాకాలంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. తడిగా ఉండే నేలపై గడ్డిమేయడం, కలుషితమైన మేత, దాణా తినడం వల్ల ఈ వైరస్ పశువులకు సోకుతుంది. ఇది అంటువ్యాధి. వైరస్, గాలి ద్వారా ఇతర పశువులకూ వ్యాపిస్తుంది. తల్లిపాల ద్వారా దూడలకు వస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ వ్యాధి పశువులకు వచ్చే అవకాశం ఎక్కువ.

Similar News

News February 3, 2026

2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ: కేటీఆర్

image

TG: నిరుద్యోగుల ఉసురు రాష్ట్ర ప్రభుత్వానికి తగలడం ఖాయమని KTR హెచ్చరించారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అని ఇచ్చిన హామీ నెరవేర్చకుండా సీఎం రేవంత్ ముఖం చాటేశారని ఫైరయ్యారు. అలాగే మూడు దఫాలుగా రైతుబంధు ఎగ్గొట్టి 70 లక్షల మంది అన్నదాతల పొట్టకొట్టారని మండిపడ్డారు. ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తానని చెప్పిన మాట అటకెక్కిందని దుయ్యబట్టారు. 420 హామీలన్నీ నయవంచన మాత్రమేనని ప్రజలు తెలుసుకున్నారన్నారు.

News February 3, 2026

ఈనెల చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు!

image

TG: CM రేవంత్ సోమవారం రాత్రి వివిధ శాఖల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. బడ్జెట్ సన్నాహక సమీక్షలు, శాఖల వారీ బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులను పరిశీలించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ పద్దుల కింద వచ్చే నిధులపై సమీక్షించారు. కాగా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ఈ నెల చివరి వారంలో నిర్వహించాలని సీఎం అధికారులకు సూచించారు. వారం రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం.

News February 3, 2026

ఇంటర్వ్యూతో స్పైస్ బోర్డ్‌లో ఉద్యోగాలు

image

<>AP: <<>>గుంటూరులోని స్పైస్ బోర్డ్‌ 3 SRD ట్రైనీస్, ట్రైనీ అనలిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. బీఎస్సీ(కెమిస్ట్రీ) అర్హత గల వారు ఫిబ్రవరి 4న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. నెలకు జీతం రూ.20వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.indianspices.com