News September 13, 2025
ట్యాబ్లెట్ వేసుకోగానే నొప్పి ఎలా తగ్గుతుందంటే?

శరీరంలో ప్రతి మందుకీ ప్రత్యేకమైన గ్రాహకాలు(రిసెప్టార్లు) ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘పేగులు, రక్తంలో కలిసి కాలేయం గుండా వెళ్లినప్పుడు మందు కొంత కరుగుతుంది. మిగిలినది గుండెకు చేరి అక్కడి నుంచి శరీరమంతా చేరుతుంది. ఒళ్లంతా వెళ్లినా పనిచేయాల్సిన గ్రాహకాలు కొన్ని భాగాల్లోనే ఉంటాయి. ఉదా.. పెయిన్ కిల్లర్ మందు మెదడులోని ఓపియాయిడ్ గ్రాహకాలను ఉత్తేజం చేసి నొప్పిని తగ్గేలా చేస్తుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News February 1, 2026
2 గంటలుగా కేసీఆర్ విచారణ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ రెండు గంటలుగా విచారిస్తోంది. అధికారులు ఏం ప్రశ్నలు అడిగారు? ఆయన ఏం సమాధానాలిచ్చారనేది ఆసక్తికరంగా మారింది. ఇదే కేసులో ఇప్పటికే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, అడిషనల్ ఎస్పీలు రాధాకిషన్ రావు, తిరుపతన్న, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్‌లను సిట్ విచారించిన విషయం తెలిసిందే.
News February 1, 2026
పొద్దుతిరుగుడు సాగు.. విత్తన మోతాదు, విత్తనశుద్ధి

యాసంగిలో పొద్దుతిరుగుడు సాగుకు సాధారణంగా ఎకరానికి 2.5-3.0 కిలోల విత్తనం అవసరం. పంట మొదటి దశలో ఆశించే చీడపీడల నివారణకు కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 3.0 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5.0 మి.లీ. కలిపి విత్తనశుద్ధి చేయాలి. సాధారణ దుక్కి పద్ధతిలో లేదా వరికోతలు తర్వాత జీరో టిల్లేజ్ పద్ధతిలో నవంబర్, డిసెంబర్ నెలల్లో విత్తుకోవచ్చు. వరికోతలు ఆలస్యమైన ప్రాంతాల్లో ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు.
News February 1, 2026
ESIC మోడల్ హాస్పిటల్ బడ్డీలో ఉద్యోగాలు

<


