News November 2, 2024
తిరుమలను వక్ఫ్ బోర్డుతో ఎలా పోలుస్తారు?: విష్ణువర్ధన్ రెడ్డి

MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన <<14510629>>వ్యాఖ్యలపై<<>> AP BJP నేత విష్ణువర్ధన్రెడ్డి స్పందించారు. ‘మీరు హిందువుల అత్యంత పవిత్రమైన స్థలాన్ని కొన్ని కమ్యూనిటీ సెంటర్ల(వక్ఫ్ బోర్డు)తో పోల్చుతున్నారు. ముస్లింల పవిత్ర స్థలం మక్కాలో హిందువులు అడుగు పెట్టలేరు. మరి మీరు తిరుమలలో ప్రవేశించాలనుకుంటున్నారా? మీరు నిజంగా బాలాజీని విశ్వసిస్తున్నారా?’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 27, 2025
APPLY NOW: SBIలో 103 పోస్టులు

SBI 103 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి నవంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, సీఏ, సీఎఫ్ఏ, సీఎఫ్పీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.750, SC, ST, PWBDలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://sbi.bank.in/ *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News October 27, 2025
$1B కాంట్రాక్ట్ రద్దు.. సైబర్ దాడుల వల్ల కాదు: TCS

Marks & Spencer కంపెనీ తమతో 1B డాలర్ల హెల్ప్డెస్క్ కాంట్రాక్టును ముగించడంపై TCS స్పందించింది. సైబర్ దాడులకు, కాంట్రాక్ట్ ముగించడానికి సంబంధం లేదని చెప్పింది. సైబర్ దాడి వైఫల్యాల వల్లే M&S కంపెనీ కాంట్రాక్టును పునరుద్ధరించలేదన్న టెలిగ్రాఫ్ కథనాన్ని తోసిపుచ్చింది. ‘సైబర్ దాడులు ఏప్రిల్లో జరిగాయి. కానీ మరో కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకునేందుకు జనవరిలోనే M&S టెండర్లు ప్రారంభించింది’ అని తెలిపింది.
News October 27, 2025
70 రకాల సొంత విత్తనాలతో సేంద్రియ సేద్యం

30 ఏళ్లుగా సేంద్రియ సేద్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సంగారెడ్డి జిల్లా బిడెకన్నకు చెందిన రైతు చిన్న చంద్రమ్మ. విత్తనాలు, ఎరువుల కోసం ఇతరులపై ఆధారపడకుండా తెలంగాణ డీడీఎస్ KVKతో కలిసి 70కి పైగా విభిన్న విత్తనాలను నిల్వ చేసి వాటినే సాగు చేస్తూ, ఇతర రైతులకు అందిస్తున్నారు. సాగు, రైతులపై పాటలు కూర్చి రేడియోలో పాడి స్ఫూర్తి నింపుతున్నారు.☛ రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


