News March 19, 2025
అంతరిక్షం ఎంత ఎత్తులో ఉంటుందంటే?

భూమిపై ఎత్తును, లోతును కొలిచేందుకు సముద్ర మట్టాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సముద్రమట్టానికి 100 కి.మీ లేదా 62 మైళ్ల ఎత్తు తర్వాత రోదసి(అంతరిక్షం) మొదలవుతుందని చాలా దేశాలు చెబుతున్నాయి. నాసా మాత్రం 80km నుంచే అంతరిక్షం మొదలవుతుందని అంటోంది. అయితే ఎక్కడి నుంచి మొదలవుతుందనే విషయమై ప్రామాణిక కొలమానమేమీ లేదు. 2009లో కాల్గరీ యూనివర్సిటీ పరిశోధకులు 118KM ఎత్తులో రోదసి మొదలవుతుందని తేల్చారు.
Similar News
News November 23, 2025
తూ.గో: భార్యాభర్తల ఘర్షణ.. అడ్డొచ్చిన మామ మృతి

భార్యాభర్తల గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఎర్రకొండలో అల్లుడి చేతిలో మామ మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. సీఐ టి.గణేషశ్ వివరాల ప్రకారం.. శ్రీనివాస్ తన భార్య నాగమణితో గొడవ పడుతుండగా, ఆమె తండ్రి అప్పలరాజు వారిని వారించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో శ్రీనివాస్ బలంగా తోసేయడంతో సిమెంట్ రోడ్డుపై పడి అప్పలరాజు తలకు తీవ్ర గాయమై మృతి చెందారు. నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.
News November 23, 2025
మొక్కజొన్న, వేరుశనగలో బోరాన్ లోప లక్షణాలు

☛ మొక్కజొన్న: లేత ఆకుల పరిమాణం తగ్గి హరిత వర్ణాన్ని కోల్పోతాయి. జల్లు చిన్నవిగా ఉండి మొక్క నుంచి బయటికి రావు. బోరాన్ లోప తీవ్రత అధికంగా ఉంటే కండెలపై గింజలు వంకర్లు తిరిగి చివరి వరకు విస్తరించవు. దీని వల్ల దిగుబడి, సరైన ధర తగ్గదు. ☛ వేరుశనగ: లేత ఆకులు పసుపు రంగులోకి మారి దళసరిగా కనిపిస్తాయి. బీజం నుంచి మొలకెత్తే లేత ఆకు కుచించుకొని రంగు మారుతుంది.


