News March 25, 2025
క్రికెటర్ తమీమ్ ఆరోగ్యం ఎలా ఉందంటే?

బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన డాక్టర్లతో మాట్లాడుతున్నారు. తమీమ్‌కు గుండెపోటు వచ్చినప్పుడు వైద్యులు దాదాపు 22 నిమిషాలపాటు CPR చేశారు. అనంతరం మూడుసార్లు DC షాక్ ఇచ్చారు. వెంటనే స్టెంట్లు అమర్చారు. దీంతో తమీమ్ మృత్యువు నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కాగా నిన్న ఓ మ్యాచ్ సందర్భంగా తమీమ్ గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే.
Similar News
News January 19, 2026
అదును తప్పిన పైరు.. ముదిమిలో బిడ్డలు ఒక్కటే

ఏ పంటకైనా అదును(అనుకూల సమయం) ముఖ్యం. సరైన సమయానికి విత్తనం వేయకపోతే పంట సరిగా రాదు, దాని వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే ముసలి వయసులో పిల్లలు పుడితే, వారు తల్లిదండ్రులకు అండగా నిలబడలేరు లేదా వారికి సేవ చేయలేరు. ఈ రెండూ సమయానికి చేయని పనులు లేదా నిష్ప్రయోజనమైన పరిస్థితులను తెలియజేస్తాయి.
News January 19, 2026
లక్కీడిప్ కాకుండా మొదటి గడప దర్శనం చేసుకోవచ్చా?

శ్రీవాణి ట్రస్ట్‌కు పది వేల రూపాయల విరాళం + ఐదు వందల రూపాయల టికెట్ కొనుగోలు చేసే భక్తులకు ‘బ్రేక్ దర్శనం’ లభిస్తుంది. దీని ద్వారా స్వామివారిని అతి చేరువగా దర్శించుకోవచ్చు. అలాగే ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే విఐపిలకు, వారి సిఫార్సు లేఖలు ఉన్నవారికి కూడా ఈ భాగ్యం కలుగుతుంది. సామాన్య భక్తులకు మాత్రం లక్కీ డిప్ ద్వారా లభించే ఆర్జిత సేవలే మొదటి గడప దర్శనానికి ఉన్న అత్యుత్తమ, సరళమైన మార్గం.
News January 19, 2026
బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్

పంతానికి పోయి బంగ్లాదేశ్ చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది. ముస్తాఫిజుర్‌ను IPL నుంచి తప్పించారని భారత్‌లో WC మ్యాచులు ఆడమని పట్టుబట్టింది. తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై ICC ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే తమను ఐర్లాండ్‌తో గ్రూప్స్ స్వాప్ చేయాలని కోరింది. దానిని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు తిరస్కరించింది. తమ షెడ్యూల్ ప్రకారమే మ్యాచులు ఆడతామని స్పష్టం చేసింది.


