News May 19, 2024
యూట్యూబ్‌లో డేటా వినియోగం ఎలా?

యూట్యూబ్.. వీడియో షేరింగ్ వేదిక. ఇందులో ఎన్నో విషయాలపై అవగాహన పెంచుకోవచ్చు. ఈ ప్లాట్ ఫాం ద్వారా ఉపాధి పొందేవారూ అనేకం. అయితే యూట్యూబ్‌లో డేటా వినియోగం మీరు చూసే వీడియో క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఉ.144p స్టాండర్డ్ క్వాలిటీ వీడియో చూస్తే నిమిషానికి యావరేజ్‌గా 1.3MB డేటా ఖర్చవుతుంది. అదే క్వాలిటీలో గంట సేపు చూస్తే 80MB డేటా ఖర్చవుతుంది. యూట్యూబ్‌లో వచ్చే యాడ్స్ కూడా ఎక్కువ డేటాను తీసుకుంటాయి.
Similar News
News November 21, 2025
వాట్సాప్‌లో అందుబాటులోకి షెడ్యూల్ కాల్ ఫీచర్..

టీమ్స్, గూగుల్ మీట్ తరహా ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఎంప్లాయీస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీతో మీటింగ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. వాయిస్‌తోపాటు వీడియో కాల్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. కాల్ పెడుతున్న ఉద్దేశం చెప్పొచ్చు. ఎవరు కనెక్ట్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరేట్ అయిన లింకును కాపీ చేసి పార్టిసిపెంట్స్‌కు షేర్ చేయవచ్చు. కాల్ మొదలయ్యే ముందు పార్టిసిపెంట్స్‌కు నోటిఫికేషన్ వెళుతుంది.
News November 21, 2025
రిజర్వేషన్ల ఖరారుకు మంత్రివర్గం ఆమోదం.. రేపే జీవో

TG: గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ రేపు GO ఇవ్వనుంది. రిజర్వేషన్లు 50% మించకుండా కొత్త రిజర్వేషన్లను సిఫార్సు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన <<18332519>>నివేదికను<<>> రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రులకు ఫైలు పంపించి ఆమోదిస్తున్నట్లు సంతకాలు తీసుకున్నారు. దీంతో రిజర్వేషన్లపై రేపు జీవో రానుంది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది.
News November 21, 2025
సీఎస్ పదవీకాలం పొడిగింపు

ఏపీ సీఎస్ విజయానంద్ పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగియనుండగా 3 నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2026 ఫిబ్రవరి వరకు విజయానంద్ సీఎస్‌గా కొనసాగనున్నారు. అనంతరం సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టనున్నారు. అదే ఏడాది మేతో ఆయన పదవీకాలం కూడా ముగియనుంది.


