News March 21, 2024
58 ఏళ్ల వయసులో IVFకు అనుమతి ఎలా?

దివంగత సింగర్ సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులు రెండో బిడ్డకు జన్మనివ్వడం వివాదాస్పదంగా మారుతోంది. సిద్ధూ తల్లి చరణ్ కౌర్ 58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ పద్ధతిలో రెండో బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఆమెకు 58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్‌కు ఎలా అనుమతి ఇచ్చారని పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశ్నించింది. ఐవీఎఫ్ పద్ధతిలో బిడ్డను కనడానికి 21 నుంచి 50 ఏళ్ల వారికే అనుమతి ఉందని తెలిపింది. దీనిపై నివేదిక సమర్పించాలని లేఖ రాసింది.
Similar News
News February 28, 2026
పెళ్లి రోజు వర్షం పడితే అశుభమా?

పెళ్లి రోజు వాన పడటం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ‘వర్షాన్ని స్వచ్ఛత, శ్రేయస్సు, దైవిక ఆశీర్వాదాలకు చిహ్నంగా భావిస్తారు. వివాహ సమయంలో వర్షం కురిస్తే ఆ నూతన వధూవరులు అదృష్టవంతులని, వారు జీవితాంతం సిరిసంపదలతో, సంతానంతో కలకాలం సంతోషంగా ఉంటారని నమ్మకం. ఇది వారి కొత్త జీవితంలో ఎదుగుదలకు, శుభారంభానికి సంకేతం. అయితే ఈ విషయాలు విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయని గమనించాలి’ అంటున్నారు.
News February 28, 2026
ESIC రాయ్‌పూర్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News February 28, 2026
ఇది ‘యుద్ధ ప్రపంచం’

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఐదారు యుద్ధాలు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ అవకాశాన్ని బట్టి ఇటు గాజాలోని హమాస్ మిలిటెంట్లు, అటు లెబనాన్‌లో హెజ్బొల్లాపై దాడులు చేస్తోంది. ఇవాళ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై అటాక్ చేశాయి. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా వార్ జరుగుతూనే ఉంది. తాజాగా పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ కూడా భీకర పోరాటాలు చేసుకుంటున్నాయి.


