News March 7, 2025

16 ఏళ్లు కలిసుండి రేప్ అంటే ఎలా?: సుప్రీం

image

16 ఏళ్లపాటు రిలేషన్‌లో ఉండి ఇప్పుడు రేప్ కేసు పెడితే ఎలా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ మహిళ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ధర్మాసనం విచారించింది. ‘16 ఏళ్లపాటు లైంగికదాడి భరించిందంటే నమ్మశక్యంగా లేదు. పరస్పర సమ్మతితోనే శారీరక సంబంధం కొనసాగినట్లు ఉంది. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా అతడిపై అనుమానం రాలేదా. ఇందులో అత్యాచారం కోణం లేనే లేదు’ అని తీర్పునిచ్చింది.

Similar News

News March 9, 2025

‘ఛాంపియన్’గా నిలిచేదెవరో?

image

వరుస విజయాలతో జోరు మీదున్న భారత జట్టు CT ఫైనల్లో ఇవాళ న్యూజిలాండ్‌తో తలపడనుంది. మ.2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్లేయర్లంతా ఫామ్‌లో ఉండటం, ఒకే వేదికలో ఆడటం INDకు కలిసొచ్చే అంశాలు. ICC ఈవెంట్లలో భారత్‌పై కివీస్‌దే పైచేయి కావడం కలవరపెడుతోంది. కాగా ఇవాళ హిట్‌మ్యాన్ సేన విజయ పరంపరను కొనసాగించి కప్పు గెలవాలని కోరుకుందాం. మ్యాచ్ లైవ్ జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో చూడొచ్చు.

News March 9, 2025

న్యాయం కోసం ప్రధానిని కలుస్తాం: హత్యాచార బాధితురాలి తల్లి

image

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార దోషి సంజయ్ రాయ్‌కి జనవరి 20న సెషన్ కోర్టు జీవితఖైదు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు వెనుక ఇంకా చాలామంది ఉన్నారంటూ మొదటి నుంచీ ఆరోపిస్తూ వస్తున్న బాధితురాలి తల్లి నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో మహిళలకు భద్రతే లేకుండా పోయిందన్నారు. తమ కూతురికి న్యాయం కోసం PM మోదీని కలుస్తామని చెప్పారు. ఈ విషయంలో ఆయన జోక్యం చేసుకోవాలని కోరారు.

News March 9, 2025

లోక్ అదాలత్ ఎఫెక్ట్.. ఒక్క రోజులో 49,056 కేసుల పరిష్కారం

image

AP: రాష్ట్రవ్యాప్తంగా నిన్న నిర్వహించిన లోక్ అదాలత్‌లలో 49,056 కేసులు పరిష్కారమయ్యాయి. మొత్తం బాధితులకు రూ.32.60 కోట్ల పరిహారం అందజేశారు. అన్ని న్యాయస్థానాల్లో 343 లోక్ అదాలత్ బెంచ్‌లు నిర్వహించగా ఇరు వర్గాల ఆమోదంతో రాజీకి ఆస్కారం ఉన్న కేసులను పరిష్కరించారు.

error: Content is protected !!