News April 15, 2025
‘భూభారతి’ పోర్టల్ ఎలా ఉందంటే?

తెలంగాణలో ఇక ‘ధరణి’ స్థానంలో ‘భూభారతి’ పోర్టల్ ఉండనుంది. ఇందులో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ROR కరెక్షన్, నాలా, అప్పీల్ & రివిజన్, ఇతరాలు ఆప్షన్లున్నాయి. అదేవిధంగా ల్యాండ్ మార్కెట్ వాల్యూ, ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్, నిషేధిత భూములు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వివరాలు, ఈ-చలాన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. గ్రామస్థాయిలో భూరికార్డుల నిర్వహణను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఈ <
Similar News
News April 7, 2026
భారతీయులు గర్వించదగ్గ క్షణం: CM చంద్రబాబు

AP: భారత్ రెండో దశ న్యూక్లియర్ ప్రోగ్రాంలో <<19586211>>సక్సెస్<<>> అవడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ విజయం దేశ అణు విద్యుత్ రంగంలో కీలక మైలురాయి. మూడో దశకు చేరుకోవడానికి మార్గం సుగమం చేసింది. భవిష్యత్తులో థోరియం నిల్వలను వినియోగించుకుంటూ ఇంధన భద్రతను సాధించేందుకు ఈ విజయం కీలకం కానుంది. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణం’ అని CBN ట్వీట్ చేశారు.
News April 7, 2026
16 ఏళ్లుగా గాలింపు.. ఇవాళ దొరికిన టెర్రరిస్టు

జమ్మూకశ్మీర్ పోలీసులు లష్కరే తోయిబా ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్న ఐదుగురిని అరెస్టు చేశారు. అందులో ఇద్దరు పాకిస్థానీ టెర్రరిస్టులు కాగా ముగ్గురు వారి సహాయకులు అని పోలీసులు వెల్లడించారు. వారిలో ఒక ఉగ్రవాదిని అబ్దుల్లా అలియాస్ అబు హురైరాగా గుర్తించారు. ఇతడి కోసం 16 ఏళ్లుగా వెతుకుతున్నారు. మరో ఉగ్రవాదిని ఉస్మాన్‌గా గుర్తించారు. J&K, రాజస్థాన్, హరియాణా సహా 19 ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు.
News April 7, 2026
ట్రంప్ డెడ్‌లైన్.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన ట్వీట్

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ విధించిన డెడ్‌లైన్ మరికొన్ని గంటల్లో ముగియనున్న వేళ ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ సంచలన ట్వీట్ చేశారు. ‘1.4 కోట్ల ఇరానియన్లు దేశాన్ని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. వారు తమ ప్రాణాలను త్యాగం చేసేందుకు వెనుకాడటం లేదు. నేనూ అందులో భాగమే. ఇరాన్ కోసం ఏ త్యాగానికైనా రెడీ’ అని స్పష్టం చేశారు.


