News January 24, 2025
మీ పిల్లలు ఎంతసేపు నిద్ర పోతున్నారు?
పోషకాహారంతో పాటు సరైన నిద్ర పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. 6-12 ఏళ్ల మధ్య ఉన్నవారు రోజుకు కనీసం 9గంటల పాటు నిద్రపోవాలని సూచిస్తున్నారు. ఇంతకంటే తక్కువ నిద్రపోతే ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటుకు గురవుతారని చెబుతున్నారు. వీళ్లు సరైన నిర్ణయాలు తీసుకోలేరని, కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపరని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే పిల్లల నిద్ర సమయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
Similar News
News January 24, 2025
రీ సర్వేపై సందేహాలా? ఈ నంబర్‌కు ఫోన్ చేయండి
APలో భూముల రీసర్వే పైలట్ ప్రాజెక్టు అమలవుతున్న నేపథ్యంలో రైతుల సందేహాల నివృత్తికై ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించింది. ఉ.10 నుంచి సా.5.30 వరకు 8143679222 నంబర్‌కు ఫోన్ చేసి సందేహాలు, సమస్యలు తెలియజేయవచ్చని సూచించింది. రీసర్వే సందర్భంగా యజమానులు భూమి వద్దకు వచ్చి హద్దులు చూపించేందుకు 3సార్లు అవకాశం ఉంటుందని, అయినా రాకపోతే వీడియో కాల్ ద్వారా హద్దులు ఖరారు చేస్తామని అధికారులు తెలిపారు.
News January 24, 2025
ముగిసిన TG CM రేవంత్ దావోస్ పర్యటన
దావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. అక్కడ జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు-2025లో పాల్గొన్న ఆయన ఈ ఉదయం 10.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ బృందం దావోస్ పర్యటన సాగింది. ఈ సందర్భంగా సీఎంకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు విమానాశ్రయానికి వెళ్లనున్నాయి.
News January 24, 2025
గ్రామాలకు మహర్దశ.. రోడ్ల నిర్మాణానికి రూ.2,773 కోట్లు మంజూరు
TG: ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు ఉండాలన్న CM రేవంత్ రెడ్డి <<15058155>>ఆదేశాల<<>> నేపథ్యంలో ప్రభుత్వం రూ.2,773కోట్లు మంజూరు చేసింది. గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.1,419కోట్లు, మరమ్మతులకు రూ.1,288కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం అమలు చేసే ‘పీఎం జన్‌మన్’ పథకానికి రాష్ట్ర వాటాగా రూ.66కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. గ్రామీణ రోడ్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే తొలిదశలో రూ.2,682కోట్లు విడుదల చేసింది.