News August 9, 2025
రాఖీ ఎప్పటి వరకు ఉంచుకోవాలంటే?

రక్షాబంధన్ రోజు కట్టిన రాఖీని దసరా వరకు ధరించడం మంచిదని పండితులు చెబుతున్నారు. కనీసం జన్మాష్టమి(ఆగస్టు 16) వరకైనా ధరించాలి. ఆ తర్వాత దానిని నది, చెరువులో నిమజ్జనం చేయాలి. సోదరి ప్రేమకు గుర్తు కాబట్టి దానిని తీసివేసేటప్పుడు ఎలాపడితే అలా తెంచి వేయకూడదు. రాఖీని జాగ్రత్తగా ముడి విప్పి తీసివేయాలి. ఈ నియమాలను పాటించడం వల్ల సోదర బంధం బలపడుతుందని, శుభ ఫలితాలు కూడా కలుగుతాయని పండితులు అంటున్నారు.
Similar News
News August 9, 2025
రాఖీ రోజున ఆడపడుచులకు పవన్ కానుక

AP: రక్షాబంధన్ రోజున ఆడపడుచులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఊహించని కానుక ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 1,500 మంది వితంతు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వివిధ కారణాలతో భర్తను కోల్పోయిన వారిలో ఆత్మస్థైర్యం నింపి, భరోసా కల్పించాలనే పవన్ ఆదేశాలతో కార్యకర్తలు ఈ కార్యక్రమం నిర్వహించారు. పవన్ స్ఫూర్తితో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు రక్షాబంధన్ కానుకలు అందజేశారు.
News August 9, 2025
విషాదం: రాఖీ కట్టి వస్తుండగా ప్రమాదం.. అక్క మృతి

TG: రాఖీ రోజున విషాదం చోటు చేసుకుంది. తమ్ముడికి రాఖీ కట్టి పుట్టింటి నుంచి తిరిగి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో అక్క చనిపోయింది. ములుగు జిల్లా నాంపల్లి క్రాస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా అదుపు తప్పి కిండపడటంతో పద్మ అక్కడికక్కడే మరణించింది. భర్తకు స్వల్పగాయాలయ్యాయి. కాగా పద్మ అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.
News August 9, 2025
ORRపై గేట్‌వే ఆఫ్ హైదరాబాద్: రేవంత్

TG: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును బహుళ ప్రయోజనాలతో నిర్మించాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలికేలా హిమాయత్ సాగర్ గాంధీ సరోవర్ సమీపంలో ORRపై గేట్‌వే ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలని సూచించారు. ఓ వైపున ఎకో థీమ్ పార్క్ అభివృద్ధి, బాపూ ఘాట్ వైపున ఐకానిక్ టవర్ నిర్మించేలా డిజైన్లు రూపొందించాలన్నారు. 2 నెలల్లో టెండర్లు పిలిచేలా పనులు వేగవంతం చేయాలని తెలిపారు.