News January 2, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఇంకెంత కాలం?: సుప్రీంకోర్టు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సుదీర్ఘకాలం కొనసాగించడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేసు దర్యాప్తు ఎప్పటికి పూర్తి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ASP తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తును తాము అడ్డుకోవాలని అనుకోవడం లేదని, తిరుపతన్న పాత్రపై పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

Similar News

News December 10, 2025

మీ ఇంట్లో ఇవి ఉంటే లక్ష్మీదేవి రాదు: పండితులు

image

శుభ్రంగా ఉండే ఇంట్లోకే లక్ష్మీదేవి వస్తుందని పండితులు, వాస్తు నిపుణులు చెబుతున్నారు. పగిలిన కప్పులు/ప్లేట్లు, పాత వార్తాపత్రికలు, కాలం చెల్లిన ఆహారం/మందులు, వాడని దుస్తులు, చనిపోయిన మొక్కలు, పనిచేయని ఎలక్ట్రానిక్స్, ప్రతికూల జ్ఞాపకాలు ఉన్న వస్తువులను వెంటనే తొలగించడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుందని అంటున్నారు. తద్వారా మానసిక ఆందోళన దూరమై ఇంట్లో శ్రేయస్సు, సంపద లభిస్తుందని అంటున్నారు.

News December 10, 2025

సౌతాఫ్రికా చెత్త రికార్డ్

image

నిన్న భారత్‌తో జరిగిన తొలి T20లో ఓటమితో SA జట్టు చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. ఆరుసార్లు 100 పరుగుల లోపు ఆలౌట్ అయిన జట్టుగా నిలిచింది. ఇందులో మూడుసార్లు భారత్‌ ప్రత్యర్థి కావడం గమనార్హం. 2022లో 87 రన్స్, 2023లో 95 పరుగులకే SA ఆలౌటైంది. నిన్నటి మ్యాచ్‌లో 74 రన్స్‌కే ప్రొటీస్ బ్యాటర్లు చాప చుట్టేశారు. అలాగే IND చేతిలో అతి ఎక్కువసార్లు తక్కువ పరుగులకే ఆలౌట్ అయిన జట్ల జాబితాలో SA 4వస్థానంలో ఉంది.

News December 10, 2025

నేడు రోడ్డెక్కనున్న 65 ఎలక్ట్రిక్ బస్సులు

image

TG: హైదరాబాద్‌లో కాలుష్యానికి పరిష్కారంగా ఇవాళ 65 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. రాణిగంజ్ RTC డిపోలో బస్సుల ప్రారంభ కార్యక్రమం జరగనుండగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నారు. ఈ బస్సులను ఈవీ ట్రాన్స్ అనే సంస్థ ఆపరేట్ చేస్తుండగా, ఆ సంస్థే నిర్వహణ బాధ్యతలను చూసుకోనుంది. 2047 నాటికి గ్రీన్ ఎనర్జీ ఆధారిత రవాణా విధానంతో ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.