News July 3, 2024
రైతు భరోసా ఎన్ని ఎకరాలకివ్వాలి?
TG: రైతు భరోసా(రైతుబంధు) ఎన్ని ఎకరాల వారికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయ శాఖ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఇప్పటికే ఆదర్శ రైతుల అభిప్రాయం సేకరించిన అధికారులు.. మరింత మంది సలహాలు స్వీకరించనున్నారు. ప్రతి సహకార సంఘంలోని రైతుల ఆలోచనలు తీసుకోనున్నారు. 5 ఎకరాలు, 8, 10, 15, 20, 30 ఎకరాల్లోపు ఎవరికి ఇవ్వాలనే దాన్ని ప్రతిపాదించి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు.
Similar News
News January 15, 2025
నన్ను దేవుడే రక్షిస్తాడు: కేజ్రీవాల్
ఖలిస్థానీ వేర్పాటువాదుల నుంచి ప్రాణహాని ఉందన్న వార్తలపై కేజ్రీవాల్ స్పందించారు. దేవుడే తనను రక్షిస్తాడని, దేవుడు అనుమతించినంత కాలం జీవిస్తానని పేర్కొన్నారు. దేవుడే రక్షించే వారిని ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ లక్ష్యంగా ఖలిస్థానీ మద్దతుదారుల హిట్ స్క్వాడ్ ఏర్పడిందని, ఢిల్లీ ఎన్నికల్లో వారు కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసుకున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి.
News January 15, 2025
ఇంటి వద్దకే టెక్నీషియన్లు.. తక్కువ ధరకే సర్వీస్: టీడీపీ
AP: వృత్తిదారులను ఆదుకునేందుకు CM CBN ఆదేశాలతో ‘హోమ్ ట్రయాంగిల్ యాప్’తో మెప్మా ఒప్పందం చేసుకుందని TDP వెల్లడించింది. ‘20వేల మంది టెక్నీషియన్లకు మెప్మా శిక్షణ ఇస్తోంది. TV, AC, ఫ్రిజ్, కంప్యూటర్ తదితర 30 రకాల డివైజ్‌లు పాడైతే టెక్నీషియన్లు ఇంటి వద్దకే వచ్చి తక్కువ ధరకే బాగుచేస్తారు. MAR నుంచి 123 పట్టణాల్లో సేవలు అందుబాటులోకి వస్తాయి. ఒక్కో టెక్నీషియన్‌కు ₹20-25వేల ఆదాయం వస్తుంది’ అని పేర్కొంది.
News January 15, 2025
త్వరలో రాహుల్ గాంధీ తెలంగాణ టూర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈమేరకు ఆయన పర్యటన ఖరారుపై ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలు చర్చించారు. త్వరలోనే రాహుల్ పర్యటన వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. అటు ఇవాళ ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.