News June 22, 2024
డీఎస్సీకి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే?

TG: డీఎస్సీకి మొత్తం 2,79,956 దరఖాస్తులు వచ్చాయని విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో వచ్చిన దరఖాస్తులకు అదనంగా మరో లక్ష మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొంది. కాగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గురువారంతో అప్లికేషన్ ప్రక్రియ ముగిసింది. వచ్చే నెల 17 నుంచి 31 వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
Similar News
News December 28, 2025
దత్తత గ్రామంలో నిర్మలమ్మ పర్యటన

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ APలో పర్యటించారు. తాను దత్తత తీసుకున్న ప.గో. జిల్లా పెదమైనవానిలంక గ్రామస్థులతో మమేకమయ్యారు. స్థానిక పాఠశాలలో రూ.18లక్షలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఏడాదిలో 146 PM ఆవాస్ యోజన ఇళ్లను పూర్తిచేయాలని, 200మంది మత్స్యకారులకు బోట్లు అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తనవంతుగా ఏ సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
News December 28, 2025
అమ్మతనానికే కళంకం.. ఇదేనా కన్న ప్రేమ?

కొందరు మహిళలు అమ్మతనానికే కాదు.. స్త్రీ జాతికే కళంకం తెస్తున్నారు. యూపీకి చెందిన సంగీత అనే వివాహిత వేరే యువకుడితో అఫైర్ పెట్టుకుని ఐదుగురు పిల్లలను గాలికొదిలేసి ప్రియుడితో పరారైంది. మరోవైపు TG నిజామాబాద్‌లో ఓ తల్లి నవమాసాలు మోసి, కని.. ముక్కు పచ్చలారకుండానే ఆ పసికందును గోదాట్లో కలిపేసింది. కన్నతీపి, పేగుబంధం అనే పదాలకు అర్థం తెలిసిన వాళ్లెవరూ ఇలా చేయరేమో? వీళ్లు అమ్మతనాన్నే అవమానించారు.
News December 28, 2025
Viral Photo: ఒకే ఫ్రేమ్‌లో రామ్ చరణ్, ధోనీ, సల్మాన్

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, క్రికెట్ లెజెండ్ MS ధోనీ, నటుడు బాబీ డియోల్ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటో SMలో వైరల్ అవుతోంది. నిన్న సల్మాన్ ఖాన్ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు చరణ్ హాజరైనట్లు తెలుస్తోంది. ఈ అరుదైన ఫొటోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. కాగా ఈ ముగ్గురి మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. గతంలో పలుమార్లు వీరు కలిసి ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి.


