News November 28, 2024

రాగి పాత్రలో నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో..

image

రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటి వల్ల చాలా ఉపయోగాలున్నాయి.
* క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది.
* థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగవుతుంది.
* కీళ్ల నొప్పులు దూరం అవుతాయి.
* నేచురల్ యాంటీబయాటిక్‌గా పని చేస్తుంది.
* ఆహారం జీర్ణమవడానికి తోడ్పడుతుంది.
* రక్తపోటు నియంత్రణకు సాయపడుతుంది.
* రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
* చర్మ ఆరోగ్యంతో పాటు శరీర దోషాలు దూరమవుతాయి.
* కొవ్వు కరిగి బరువు తగ్గడానికి సాయపడుతుంది.

Similar News

News November 28, 2024

ఈడీ అధికారులపై దాడి

image

సైబర్ నేరాలకు సంబంధించి మనీలాండరింగ్ కేసుపై ఢిల్లీలో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ బృందంపై దుండగులు కుర్చీలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ అధికారికి స్వల్ప గాయాలయ్యాయి. నిందితులు అశోక్ శర్మ, అతని సోదరుడిపై పోలీసులు FIR నమోదు చేశారు. ఫిషింగ్, క్యూఆర్ కోడ్, పార్ట్ టైమ్ జాబ్స్ వంటి వేలాది స్కామ్‌ల నుంచి వచ్చిన అక్రమ నిధుల గుట్టు రట్టు చేసేందుకు ఈడీ దేశవ్యాప్తంగా దాడులు చేస్తోంది.

News November 28, 2024

నెమ్మదిగా కదులుతున్న తీవ్ర వాయుగుండం

image

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గడిచిన 6గంటల్లో 2కి.మీ. వేగంతో నెమ్మదిగా కదులుతోందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి ట్రింకోమలికి 110కి.మీ, నాగపట్నానికి 310కి.మీ, పుదుచ్చేరికి 410కి.మీ, చెన్నైకి 480కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయినట్లు వెల్లడించింది. రానున్న 12 గంటల్లో వాయుగుండం శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తుందని, రేపు ఉదయం లోపు తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

News November 28, 2024

వచ్చే ఏడాది అఖిల్-జైనబ్ వివాహం: నాగార్జున

image

అక్కినేని చైతన్య-శోభితతోపాటు అఖిల్-జైనబ్ వివాహం డిసెంబర్ 4నే జరుగుతుందనే ప్రచారాన్ని నాగార్జున ఖండించారు. చిన్న కొడుకు పెళ్లి వచ్చే ఏడాది చేస్తామని తెలిపారు. ‘అఖిల్ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నా. అతనికి కాబోయే భార్య జైనబ్ మంచి అమ్మాయి. వారిద్దరూ జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకోవడం మంచి విషయం’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అఖిల్-జైనబ్ ఎంగేజ్‌మెంట్ ఈ నెల 26న జరిగిన విషయం తెలిసిందే.