News December 21, 2024
ఏపీ హైకోర్టులో ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయంటే?
ఏపీ హైకోర్టులో 2,47,097 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో వెల్లడించారు. జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 9,04,462 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. హైకోర్టులో మొత్తం 37 మంది జడ్జిలు ఉండాల్సి ఉండగా, 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. సుప్రీం కోర్టులో 82,640, అన్ని రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో కలిపి మొత్తం 61,80,878 పెండింగ్ కేసులు ఉన్నాయని చెప్పారు.
Similar News
News December 21, 2024
స్థానిక సంస్థల ఎన్నికలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
TG: ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రూల్‌ను మార్చాలంటూ వచ్చిన ప్రతిపాదనను రిజెక్ట్ చేసింది. ఈ నిబంధన మినహా ఇతర అంశాలతో పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. కాగా ఏపీలో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించిన సంగతి తెలిసిందే.
News December 21, 2024
‘భరణం’ పేరిట భర్తను భార్య దోచుకోకూడదు: సుప్రీం
భరణమనేది స్త్రీ సంక్షేమాన్ని ఉద్దేశించి ఇప్పించేది మాత్రమే తప్ప తమ మాజీ భర్తను బెదిరించేందుకు దాన్ని భార్యలు ఉపయోగించుకోకూడదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. భర్త ఆస్తి, ఆదాయానికి తగిన మనోవర్తి కోరడం సరికాదంది. భర్తకు రూ.5 వేల కోట్ల ఆస్తి ఉందని, అందుకు తగినట్లుగా భరణం ఇప్పించాలని ఓ మహిళ వేసిన పిటిషన్‌ను సుప్రీం తోసిపుచ్చింది. వన్‌టైమ్ సెటిల్మెంట్‌గా రూ.12 కోట్లు భరణం ఇవ్వాలని భర్తను ఆదేశించింది.
News December 21, 2024
ఇంద్రకీలాద్రిలో నేటి నుంచి భవానీ దీక్షల విరమణ
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి 25వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణలు జరగనున్నాయి. భక్తులు ఏ క్యూలోనైనా ఫ్రీ దర్శనం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతరాలయ ప్రవేశం ఉండదని, ఆర్జిత సేవలు రద్దు చేశామన్నారు. ఉచిత అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ వివరాలను ప్లే స్టోర్‌లోని ‘భవానీ దీక్ష 2024’ యాప్‌లో చూసుకోవచ్చు. రోజుకు సుమారు లక్ష మంది చొప్పున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా.