News August 9, 2025
మహేశ్ బాబు నెట్‌వర్త్ ఎన్ని కోట్లంటే?

సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలతోపాటు యాడ్స్, స్టూడియో, AMB సినిమాస్, ఇతర వ్యాపారాలతో భారీగా సంపాదిస్తున్నారు. మహేశ్ మొత్తం ఆస్తుల విలువ రూ.400 కోట్లకుపైనేనని అంచనా. హైదరాబాద్‌లో రూ.50 కోట్ల విలువైన ఇల్లు, ప్రైవేట్ జెట్, ముంబై, బెంగళూరులో భారీగా ఆస్తులు ఉన్నాయి. అలాగే ఆడి, రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ కార్లు ఉన్నాయి. కాగా, ఆయన తన పేరిట ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతోమందికి సాయం చేస్తున్నారు.
Similar News
News August 9, 2025
అది తప్పుడు ప్రచారం: చిరంజీవి

సినీ కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై తాను హామీ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. ‘కార్మికులకు 30% వేతనం పెంపు తదితర డిమాండ్లు అమలయ్యేలా చూస్తానని, షూటింగ్ ప్రారంభిస్తానని నేను హామీ ఇచ్చినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరినీ కలవలేదు. ఇది ఇండస్ట్రీ సమస్య. వ్యక్తిగతంగా ఎలాంటి హామీ ఇవ్వలేను. ఫిల్మ్ ఛాంబర్‌దే తుది నిర్ణయం’ అని పేర్కొన్నారు.
News August 9, 2025
అరంగేట్రంలోనే అరుదైన రికార్డు

జింబాబ్వేతో రెండో టెస్టులో న్యూజిలాండ్ బౌలర్ జాకరీ ఫౌల్కెస్ రికార్డు సృష్టించారు. అరంగేట్ర మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన(9/75) చేసిన బౌలర్‌గా నిలిచారు. దీంతో విలియమ్ ఓరూర్కీ రికార్డు(9/93)ను అధిగమించారు. ఓవరాల్‌గా భారత మాజీ బౌలర్ నరేంద్ర హీర్వానీ 16/136తో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్&359 రన్స్ తేడాతో జింబాబ్వేను ఓడించిన NZ టెస్టుల్లో మూడో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.
News August 9, 2025
రాఖీ రోజున ఆడపడుచులకు పవన్ కానుక

AP: రక్షాబంధన్ రోజున ఆడపడుచులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఊహించని కానుక ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 1,500 మంది వితంతు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వివిధ కారణాలతో భర్తను కోల్పోయిన వారిలో ఆత్మస్థైర్యం నింపి, భరోసా కల్పించాలనే పవన్ ఆదేశాలతో కార్యకర్తలు ఈ కార్యక్రమం నిర్వహించారు. పవన్ స్ఫూర్తితో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు రక్షాబంధన్ కానుకలు అందజేశారు.