News February 6, 2025

2009 నుంచి అక్రమ వలసదారులు ఎందరు వచ్చారంటే: జైశంకర్

image

అమెరికాతో ఎవరికీ లేని విధంగా మనకు పౌరులను వెనక్కి తీసుకొచ్చే ఒప్పందం ఉందని EAM జైశంకర్ అన్నారు. అక్కడ అక్రమంగా ఉంటున్నవారిని ఇక్కడికి పంపించడం ఇదే తొలిసారి కాదన్నారు. 2009 నుంచి 2025 వరకు వరుసగా 734, 799, 597, 530, 550, 591, 708, 1303, 1024, 1180, 2042, 1889, 805, 862, 670, 1368, 104 మందిని పంపినట్టు వెల్లడించారు. మిగిలిన వారిని సురక్షితంగా తీసుకొస్తామని రాజ్యసభలో వివరించారు.

Similar News

News December 11, 2025

AP క్యాబినెట్ నిర్ణయాలు

image

*పలు సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం
*సీడ్ యాక్సెస్ రహదారి-NH16 అనుసంధాన పనులకు రూ.532కోట్లకు గ్రీన్ సిగ్నల్
*AP ప్రిజన్స్&కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుకు ఓకే
*రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశ నిర్ణయాలకు ఆమోదం
*SIPBలో తీసుకున్న నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
*కుప్పంలో పాలేరు నదిపై చెక్‌డ్యామ్‌ల నిర్వహణకు పరిపాలన అనుమతుల మంజూరుకు ఆమోదం

News December 11, 2025

18న గవర్నర్‌తో జగన్ భేటీ

image

AP: గవర్నర్‌‌తో YCP చీఫ్ YS జగన్ భేటీ తేదీ ఖరారైంది. ఈనెల 18న ఆయన గవర్నర్‌ను కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్ర ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాలను సమర్పిస్తారు. కాగా జగన్‌కు ఈనెల 17న గవర్నర్ అపాయింట్మెంటు ఇచ్చినప్పటికీ అనివార్య కారణాలతో దాన్ని 18కి వాయిదా వేసినట్లు తాజాగా లోక్‌భవన్ కార్యదర్శి లేఖ పంపారు. కాగా కోటి సంతకాల పత్రాలను YCP నేతలు విజయవాడకు తరలిస్తున్నారు.

News December 11, 2025

సర్పంచ్ ఎన్నికలు.. 9 ఓట్లతో గెలిచాడు

image

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్నాయి. స్వల్ప ఓట్ల తేడాతో కొందరు అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చీన్యా తండాలో బీఆర్ఎస్ బలపరిచిన జాటోత్ హరిచంద్ 9 ఓట్లతో గెలిచారు. అటు జగిత్యాల జిల్లా తిమ్మాపూర్‌ తండాలోనూ బీఆర్ఎస్ బలపరిచిన మెగావత్ లత 12 ఓట్లతో విజయం సాధించారు.