News January 4, 2025

దేశంలో ఎడమ చేతి వాటం కలిగిన వారెందరంటే?

image

క్లాసులో వంద మంది ఉంటే అందులో ఒకరో, ఇద్దరో ఎడమ చేతి వాటం కలిగిన వ్యక్తులుంటారు. అంటే, ఇలాంటి స్పెషల్ వ్యక్తులు చాలా అరుదన్నమాట. భారతదేశ జనాభాలో వీరు 5.20శాతం మంది ఉన్నారు. అత్యధికంగా అమెరికాలో 13.10 శాతం మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉండగా 12.80శాతంతో కెనడా రెండో స్థానంలో ఉంది. UKలో 12.24%, ఫ్రాన్స్‌లో 11.15%, ఇటలీలో 10.51%, జర్మనీలో 9.83శాతం మంది ఉన్నారు. మీకు తెలిసిన లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరైనా ఉన్నారా?

Similar News

News January 6, 2025

రాష్ట్రంలో కొత్తగా 18 లక్షల మంది ఓటర్లు: ఈసీ

image

TG: రాష్ట్రంలో ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ సవరించింది. ఈసీ విడుదల చేసిన కొత్త జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,66,41,489 మంది, స్త్రీలు 1,68,67,735 మంది ఉన్నారు. 2,829 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. కాగా గత ఎన్నికల ముందు రాష్ట్రంలో 3,17,17,389 మంది ఓటర్లు ఉన్న విషయం తెలిసిందే. దాదాపు 18 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారు.

News January 6, 2025

BREAKING: మరో రెండు hMPV కేసులు

image

దేశంలో మరో రెండు hMPV కేసులు వెలుగుచూశాయి. చెన్నైలో ఇద్దరు చిన్నారులకు వైరస్ సోకినట్లు తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఆరుకు చేరింది.

News January 6, 2025

హీరో విశాల్ ఆరోగ్యంపై అపోలో డాక్టర్ల అప్డేట్

image

<<15074772>>హీరో విశాల్<<>> ఆరోగ్యంపై చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు స్పందించారు. ‘ప్రస్తుతం విశాల్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఆయనకు చికిత్స అందిస్తున్నాం. విశాల్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఓ లెటర్ రిలీజ్ చేశారు. కాగా ‘మదగజరాజ’ ఈవెంట్‌లో విశాల్ వణుకుతూ, సరిగ్గా నడవలేకుండా కనిపించారు. పూర్తిగా సన్నబడిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.