News July 18, 2024
TDP వాళ్ల రాక్షసానందానికి ఇంకెంతమంది బలి కావాలి?: YCP

AP: పల్నాడులో తమ కార్యకర్త దారుణ <<13650476>>హత్యపై<<>> వైసీపీ తీవ్రంగా స్పందించింది. ‘మీ టీడీపీ వాళ్ల రాక్షసానందానికి ఇంకెంతమంది బలి కావాలి?’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనితను ట్విటర్లో ట్యాగ్ చేసింది. ‘దేశంలో మరీ ఇంత నీచమైన కక్ష సాధింపు రాజకీయాలు ఎవరైనా చేస్తారా చంద్రబాబు?’ అని ప్రశ్నించింది. రషీద్ను జిలానీ కత్తితో నరుకుతున్న వీడియోను పోస్ట్ చేసింది.
Similar News
News November 24, 2025
ఇది సరిగా ఉంటే ఆరోగ్యం మీ వెంటే..

మనిషి జీవనశైలిని నియంత్రించేది జీవ గడియారం. అంటే బయోలాజికల్ క్లాక్. రోజువారీ జీవితంలో నిద్ర, ఆకలి, జీర్ణక్రియ, జీవరసాయన ప్రక్రియలు సమయానికి జరిగేలా చూస్తుంది. అయితే దీంట్లో సమతుల్యత లోపిస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. శారీరకంగా, మానసికంగా క్రమంగా శక్తిహీనులుగా మారిపోతుంటే అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.
News November 24, 2025
భారీగా పెరిగిన కూరగాయల ధరలు!

TG: కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లు, వారాంతపు సంతల్లో ఏ కూరగాయ అయినా కేజీ రూ.80 నుంచి రూ.120 పలుకుతోంది. తోటకూర కిలో రూ.90 వరకు అమ్ముతుండగా, పాలకూర రేటు రూ.160కి చేరింది. బీర, బెండ, కాకర, క్యాప్సికం, చిక్కుడు, వంకాయ రేట్లు గత 2 నెలలతో పోలిస్తే డబుల్ అయ్యాయి. తుఫాన్ ప్రభావంతో పంట నష్టం, దిగుబడి తగ్గడంతో కూరగాయల రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
News November 24, 2025
నేటి నుంచి ‘రైతన్నా.. మీకోసం’

AP: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నేటి నుంచి వారం పాటు ‘రైతన్నా.. మీకోసం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ ప్రోగ్రామ్లో భాగంగా CM CBNతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు అన్నదాతల ఇళ్ల వద్దకే వెళ్తారు. రైతుల కోసం ప్రభుత్వం ఏం చేసింది? ఏం చేయబోతోంది? అనేది వివరిస్తారు. పురుగుమందుల వాడకంతో నష్టాలు, నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, ఫుడ్ ప్రాసెసింగ్పై అవగాహన కల్పిస్తారు.


