News April 28, 2024

17 స్థానాలకు ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే?

image

TG: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు 17 స్థానాల్లో 625 మంది నామినేషన్లను ఆమోదించినట్లు ఈసీ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 893 మంది 1,488 సెట్ల నామపత్రాలు సమర్పించగా.. 268 మందికి చెందిన 428 సెట్లను తిరస్కరించినట్లు పేర్కొంది. పరిశీలన అనంతరం మెదక్‌లో 53 నామినేషన్లు వచ్చినట్లు తెలిపింది. కాగా నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 29న ముగియనుంది.

Similar News

News December 20, 2025

ఈ నెల 28 నుంచి అసెంబ్లీ?

image

TG: ఈ నెల 28 నుంచి 3 రోజులపాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హిల్ట్ పాలసీ, ఇరిగేషన్, GHMC విలీన ప్రక్రియ, ఫోన్ ట్యాపింగ్‌‌పై సిట్ విచారణ, ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌పై ఏసీబీ విచారణ తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే సర్కారు పలు బిల్లులను ప్రవేశపెట్టనుంది. పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో BCలకు పార్టీపరంగా 42% టికెట్లు ఇచ్చే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం.

News December 20, 2025

అంతరిక్షం నుంచి సేఫ్‌గా కిందకు.. ఇస్రో పారాచూట్ టెస్ట్ సక్సెస్!

image

గగన్‌యాన్ మిషన్‌లో కీలకమైన ‘డ్రోగ్ పారాచూట్’ టెస్టులను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. చండీగఢ్‌లో ఈ నెల 18, 19 తేదీల్లో ఈ ప్రయోగాలు జరిగాయి. అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చే క్రమంలో క్రూ మాడ్యూల్ స్పీడ్ తగ్గించి, స్థిరంగా ఉంచడంలో ఈ పారాచూట్లు హెల్ప్ చేస్తాయి. ప్రయోగ పరీక్షల్లో భారీ గాలి ఒత్తిడిని ఇవి సమర్థంగా తట్టుకున్నాయి. మానవ సహిత రోదసీ యాత్ర దిశగా ఇది మరో ముఖ్యమైన అడుగు.

News December 20, 2025

చైనా అభివృద్ధి వెనుక ఒకేఒక్కడు.. ఎవరంటే?

image

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయిలో ఉన్న చైనా 1978కి ముందు పేదరికంతో కొట్టుమిట్టాడిందనే విషయం మీకు తెలుసా? చైనీస్ రాజనీతిజ్ఞుడు డెంగ్‌ జియావో పింగ్‌ ఆర్థిక సంస్కరణల ఫలితంగానే ఆ దేశం ఇప్పుడు ఈ స్థాయికి చేరింది. మార్కెట్ వ్యవస్థలో సంస్కరణలు, ప్రైవేటు సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విదేశీ పెట్టుబడులను స్వాగతించడంతో చైనా ఆర్థికంగా పుంజుకుంది. ఫలితంగా కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడ్డారు.