News December 30, 2024

ఎయిడ్స్‌తో ఇప్పుడు ఎందరు బతుకుతున్నారంటే..

image

HIV/AIDSను 1983లో మొదటిసారి అమెరికాలో గుర్తించారు. అక్కడి నుంచి అన్ని దేశాలకు పాకేసింది. ప్రపంచానికి ఇదో పెనుముప్పుగా మారడంతో ‘ఎయిడ్స్‌కు మందు లేదు. నివారణే మార్గం’ అన్న నినాదం పుట్టుకొచ్చింది. HIV సోకి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4.2 కోట్ల మంది చనిపోయారని అంచనా. మొత్తంగా 8.8 కోట్ల మందికి సోకింది. 2023 చివరి నాటికి 4 కోట్ల మంది ఎయిడ్స్‌తోనే బతుకుతున్నారు. ఎట్టకేలకు వ్యాక్సిన్ రావడం భారీ ఊరట.

Similar News

News January 2, 2025

రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్!

image

ఆస్ట్రేలియాతో రేపటి నుంచి జరిగే ఐదో టెస్టు నుంచి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచులో కెప్టెన్‌గా బుమ్రా వ్యవహరిస్తారని క్రీడా వర్గాలు తెలిపాయి. ఈ మ్యాచుకు తాను దూరంగా ఉంటానని హెడ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్‌కు స్వయంగా రోహితే చెప్పినట్లు సమాచారం. దీనిపై రేపు స్పష్టత రానుంది. ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్ స్థాయికి తగ్గట్లుగా ఆడకపోవడంపై విమర్శలొస్తున్నాయి.

News January 2, 2025

క్రీడల్లో ప్రతిభకు ప్రతిష్ఠాత్మక పురస్కారం

image

క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభకు గుర్తింపుగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును ప్రదానం చేస్తారు. 1991-92 నుంచి ఈ పురస్కారాన్ని ప్రకటిస్తున్నారు. నాలుగేళ్ల వ్యవధిలో క్రీడాకారుల ప్రదర్శన ఆధారంగా క్రీడల మంత్రిత్వ శాఖ అవార్డులకు ఎంపిక చేస్తుంది. ఎంపికైన వారికి మెడ‌ల్‌, స‌ర్టిఫికెట్‌తోపాటు ₹25 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తిని అందిస్తారు. ఈ <<15045667>>ఏడాది<<>> మనూభాకర్, గుకేశ్, ప్రవీణ్ కుమార్, హర్మన్‌ప్రీత్‌లను వరించింది.

News January 2, 2025

బుల్స్ జోరు.. కొత్త ఏడాది హుషారు

image

కొత్త ఏడాది ఇన్వెస్ట‌ర్ల‌లో జోష్ నింపిన‌ట్టు క‌నిపిస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలు గ‌డించాయి. Sensex 1,436 పాయింట్ల లాభంతో 79,943 వ‌ద్ద‌, Nifty 445 పాయింట్లు ఎగ‌సి 24,188 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. అన్ని రంగాల షేర్ల‌కు కొనుగోళ్ల మ‌ద్ద‌తు ల‌భించింది. ఆటో రంగ షేర్లు అత్య‌ధికంగా 3.79% లాభ‌ప‌డ్డాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, ఎఫ్ఎంసీజీ, మెట‌ల్‌, ఫార్మా, రియ‌ల్టీ రంగ షేర్లు రాణించాయి.