News January 22, 2025
AP & TGలో ఏడాదికి రూ.కోటి సంపాదించేవారు ఎంతంటే?
ఏడాదికి రూ.కోటి సంపాదించే వారు అత్యధికంగా మహారాష్ట్రలో ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్-2024 డేటా ప్రకారం అక్కడ ఏకంగా 1,24,800 మంది కోటికి పైగా సంపాదిస్తున్నారు. అత్యల్పంగా లక్షద్వీప్‌లో కేవలం ఒకరు, లద్దాక్‌లో ముగ్గురు మాత్రమే రూ.1 కోటి అర్జిస్తున్నారు. ఇక ఏపీలో 5,340 మంది ఉండగా తెలంగాణలో 1,260 మంది ఉన్నారు.
Similar News
News January 22, 2025
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. కర్నూలు వాసులు మృతి
కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు మరణించారు. రఘునందనతీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తుండగా రాయచూరు జిల్లా సింధనూరు వద్ద టైర్ పంక్చర్ కావడంతో తుఫాన్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మంత్రాలయం వేదపాఠశాల విద్యార్థులుగా గుర్తించారు.
News January 22, 2025
తెలుగు రాష్ట్రాల్లో పురుష, మహిళా ఓటర్ల శాతం ఇలా..
దేశంలోని 12 రాష్ట్రాల్లో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఏపీలో 100 మంది పురుషులకు గానూ 103 మంది(100:103) మహిళలు, తెలంగాణలో 100 మంది పురుషులకు 100 మంది మహిళా ఓటర్లు(100:100) ఉన్నట్లు పేర్కొంది. కేరళ, అరుణాచల్ ప్రదేశ్‌లో అత్యధికంగా ఈ నిష్పత్తి 100: 109గా ఉంది. అత్యల్పంగా గుజరాత్, హరియాణా, ఢిల్లీలో 100:84గా ఉన్నట్లు తెలిపింది.
News January 22, 2025
రేపటి నుంచి స్లాటెడ్ దర్శన టోకెన్ల జారీ
తిరుమల శ్రీవారి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను రేపటి నుంచి జారీ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. SSD టోకెన్ల జారీపై అధికారులతో TTD EO సమీక్షించారు. ఈ విధానం లేకుండా దర్శనాలు ఎలా జరిగాయి? రద్దు చేస్తే కలిగే పరిణామాలు, క్యూ లైన్లు, భద్రత వంటి అంశాలపై చర్చించారు. రేపటి నుంచి ఏ రోజుకారోజు టోకెన్లను అలిపిరి భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసంలో జారీ చేయాలని ఈవో శ్యామలరావు ఆదేశించారు.