News December 4, 2024
మన దేశంలో ఎంత మందికి కార్లు ఉన్నాయంటే?

మన దేశంలో దాదాపు 6% మందికే సొంత కార్లు ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ప్రపంచంలో అత్యధికంగా ఇటలీలో 89% మందికి కార్లు ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత అమెరికా (88%), జర్మనీ (85%), ఫ్రాన్స్ (83%), సౌత్ కొరియా (83%), జపాన్ (81%), స్పెయిన్ (79%), యూకే (74%), ఇజ్రాయెల్ (71%), రష్యా (55%), బ్రెజిల్ (47%), సౌతాఫ్రికా (31%), ఉక్రెయిన్ (29%), చైనా (17%), పాకిస్థాన్ (3%), బంగ్లాదేశ్‌లో (2%) మందికి కార్లు ఉన్నాయి.
Similar News
News December 3, 2025
హిల్ట్ పాలసీ లీక్.. విచారణకు ప్రభుత్వం ఆదేశం!

TG: హిల్ట్ పాలసీ కసరత్తు దశలోనే వివరాలు బయటకు రావడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. నవంబర్ 20నే ఫొటోషాప్ స్లైడ్స్ బయటకు వచ్చాయని అనుమానిస్తోంది. మరుసటి రోజే <<18440700>>హిల్ట్ <<>>పాలసీపై KTR ప్రెస్‌మీట్ పెట్టడంతో కొందరు సీనియర్ IAS అధికారులకు CM వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. NOV 22న జీవో విడుదలవ్వగా లీక్ విషయమై ఐపీఎస్ నేతృత్వంలో నిఘా వర్గాలు సమాచారం సేకరించే పనిలో పడ్డాయి.
News December 3, 2025
సంచార్ సాథీ యాప్‌తో స్నూపింగ్ సాధ్యం కాదు: కేంద్రం

సంచార్ సాథీ యాప్‌తో స్నూపింగ్ జరగలేదు, జరగబోదని లోక్‌సభలో కేంద్రమంత్రి సింధియా స్పష్టం చేశారు. భారత్‌లో అమ్మే ప్రతి ఫోన్లో ఆ యాప్ ప్రీ ఇన్స్టాల్ చేయాలని మొబైల్ తయారీ కంపెనీలకు సూచించారు. ఇప్పటికే అమ్మిన వాటిలో సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఇన్స్టాల్ చేయాలన్నారు. మొదటిసారి ఫోన్ వాడేటప్పుడు కూడా డిజేబుల్, రెస్ట్రిక్ట్ చేసే ఆప్షన్స్ ఉండబోవని చెప్పారు. ప్రజల భద్రతే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు.
News December 3, 2025
హనుమాన్ చాలీసా భావం – 28

ఔర మనోరథ జో కోయీ లావై |
సోయి అమిత జీవన ఫల పావై ||
మనుషులు అనేక కోరికలతో దేవుళ్లను ప్రార్థిస్తారు. కానీ, హనుమంతుడిని సేవించేవారు మాత్రం జీవితంలో అపారమైన జీవన ఫలాలను పొందుతారు. ఆయన అనుగ్రహంతో అన్ని రకాల సుఖ సంతోషాలు, విజయాలు, అంతిమంగా మోక్షం కూడా లభిస్తాయి. హనుమంతుడిని వరం కోరడం అంటే, ఇక వేరే కోరిక అవసరం లేదు అని సందేశం. <<-se>>#HANUMANCHALISA<<>>


