News April 1, 2025
కొత్త రేషన్ కార్డులు ఎందరికంటే?

TG: రాష్ట్రంలో 5 లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 1.26 లక్షల లబ్ధిదారులను ఎంపిక చేయగా 4.32 లక్షల ఆర్జీలపై నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ జారీ ప్రక్రియ ఆలస్యమైనా జాబితాలో పేరుంటే రేషన్ పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. మరోవైపు కొత్త కార్డుల ముద్రణ ఇంకా టెండర్ దశలోనే ఉంది. కాగా నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయనుంది.
Similar News
News April 2, 2025
BREAKING: మయన్మార్‌లో మరోసారి భూకంపం

వరుస భూకంపాలు మయన్మార్ ప్రజలకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే మయన్మార్‌లో మరోసారి భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. 4.15pmకు భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. గత నెల 28న సంభవించిన భారీ భూకంపానికి ఇప్పటివరకూ 2,700 మందికి పైగా చనిపోగా శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు.
News April 2, 2025
ధోనీ ఔట్‌పై రియాక్షన్ వైరల్.. ఫ్యాన్ గర్ల్ ఏమన్నారంటే?

IPL: RR vs CSK మ్యాచ్‌లో ధోనీ ఔటైన సమయంలో ఓ ఫ్యాన్ గర్ల్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే. ఆమె పేరు ఆర్యప్రియా భుయాన్. గువాహటికి చెందిన ఈ 19 ఏళ్ల యువతి ఆ రియాక్షన్‌పై తాజాగా స్పందించారు. ‘CSKకు సపోర్ట్ చేసేందుకు ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో వెళ్లాను. ధోనీ ఔటవడంతో అనుకోకుండా అలా రియాక్ట్ అయ్యాను. టీవీలో కనిపించిన విషయం నాకు తెలియదు. తర్వాత ఫ్రెండ్స్ చెప్తే తెలిసింది’ అని పేర్కొన్నారు.
News April 2, 2025
ఎకరానికి రూ.31,000: మంత్రి ప్రకటన

AP: రిలయన్స్ <<15966046>>CBG ప్లాంట్లతో<<>> ప్రకాశం జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. గుజరాత్ కంటే ఏపీలోనే రిలయన్స్ ఎక్కువగా ఈ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోందన్నారు. వీటి ద్వారా బంజరు భూములు వినియోగంలోకి వస్తాయని చెప్పారు. ప్రభుత్వ భూమికి ఎకరానికి రూ.15వేలు, ప్రైవేట్ భూములకు రూ.31వేలు కౌలు చెల్లిస్తామన్నారు. కందుకూరులో ఇండోసోల్ ప్లాంట్, BPCL అందుబాటులోకి రానున్నాయన్నారు.