News October 10, 2024
ఎంతమంది ఆప్తులయ్యా నీకు టాటా..!

మనం లోకాన్ని వీడిన రోజున ఆర్తిగా కన్నీరు పెట్టే నలుగురు లేనప్పుడు ఎంత ఆస్తి ఉన్నా నిరుపయోగమేనంటారు విజ్ఞులు. ఈ విషయంలో రతన్ టాటా కచ్చితంగా శ్రీమంతుడే. ఆస్తిపరంగానే కాక ఆత్మీయుల విషయంలోనూ కుబేరుడే. ఆయన మరణ వార్త తెలిసినప్పటి నుంచీ సోషల్ మీడియా, వాట్సాప్‌లో అన్నింటా ఆయన ఫొటోలే. అందరూ ఆయన గొప్పదనాన్ని తలచుకుంటున్నవారే. ఏదో తమ కుటుంబీకుడినే కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నవారే.
Similar News
News January 29, 2026
రేపు రాలేను, ఎర్రవల్లి ఫాంహౌస్‌కు రండి: కేసీఆర్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ జారీ చేసిన నోటీసులకు కేసీఆర్ బదులిచ్చారు. ముందే షెడ్యూల్ అయిన మున్సిపల్ ఎలక్షన్ కార్యక్రమాల వల్ల రేపు విచారణకు హాజరు కాలేనని పోలీసులకు తెలిపారు. మరో తేదీన తనను ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే విచారించాలని విచారణ అధికారిని కోరారు. మాజీ సీఎంగా, బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరిస్తానని తెలిపారు. భవిష్యత్తులో జారీ చేసే నోటీసులను కూడా ఎర్రవల్లికే పంపాలని పేర్కొన్నారు.
News January 29, 2026
ప్రధానిగా మోదీనే బెస్ట్: ఇండియా టుడే సర్వే

భారత ప్రధానిగా మోదీనే బెస్ట్ అని 55 శాతం మంది భావించినట్లు Mood of the Nation సర్వేలో ఇండియా టుడే వెల్లడించింది. 6 నెలల కిందటితో పోలిస్తే 3% పెరిగినట్లు తెలిపింది. మోదీ పనితీరుపై 57% మంది సంతృప్తి వ్యక్తం చేశారని, గుడ్ రేటింగ్ ఇచ్చారని వివరించింది. యావరేజ్ అని 16%, పూర్ అని 24% మంది అభిప్రాయపడ్డారని చెప్పింది. మరోవైపు బెస్ట్ సూటెడ్ PM అంటూ రాహుల్ గాంధీ వైపు 27% మంది మొగ్గు చూపినట్లు పేర్కొంది.
News January 29, 2026
పాకిస్థాన్‌కు అంత దమ్ము లేదు: రహానే

T20 ప్రపంచ కప్‌ను బాయ్‌కాట్ చేస్తామంటూ బెదిరిస్తున్న పాకిస్థాన్‌పై భారత క్రికెటర్ అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ అలా చేస్తుందని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఆ జట్టుకు అంత దమ్ము లేదన్నారు. టోర్నీ ఆడేందుకు పాక్ వస్తుందని అభిప్రాయపడ్డారు. వరల్డ్ కప్ కోసం శ్రీలంకలోని కొలంబోకు వెళ్లేందుకు పాకిస్థాన్ టీమ్ టికెట్లు బుక్ <<18990370>>చేసుకున్నట్లు<<>> వార్తలు రావడం తెలిసిందే.


