News March 5, 2025

‘అన్నదాత సుఖీభవ’ ఎంత మందికి ఇస్తారు?: బొత్స

image

AP: రైతుల సమస్యలపై శాసన మండలిలో వైసీపీ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు ఇస్తామని ఎన్నికల్లో చెప్పారు. ఎంత మందికి, ఎప్పుడు ఇస్తారో చెప్పాలి’ అని ప్రతిపక్ష నేత బొత్స నిలదీశారు. రైతులకు మంచి జరగాలనేదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. గతంలోనూ రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. అధికార పక్షం తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు.

Similar News

News November 5, 2025

దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

image

ఎకనామిక్ సర్వే (2024-25) ప్రకారం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తలసరి GDPలో దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా నిలిచింది. దీని తలసరి GDP ₹11.46 లక్షలు. ఆ తర్వాత గురుగ్రామ్ (₹9.05 లక్షలు), బెంగళూరు అర్బన్ (₹8.93L), గౌతమ్ బుద్ధ్ నగర్-నోయిడా, సోలాన్ (HP), నార్త్&సౌత్ గోవా, సిక్కిం, దక్షిణ కన్నడ, ముంబై(₹6.57L), అహ్మదాబాద్ ఉన్నాయి. ఐటీ, ఫార్మా కంపెనీలు, మెరుగైన కనెక్టివిటీ వల్ల రంగారెడ్డి టాప్‌లో నిలిచింది.

News November 5, 2025

విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే గుర్తింపు రద్దు

image

AP: కోర్సులు పూర్తైనా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఆ కాలేజ్, ప్రైవేటు వర్సిటీ గుర్తింపు రద్దుకు సిఫార్సు చేస్తామని ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్ హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.15 లక్షలు జరిమానా విధిస్తామంది. ప్రైవేటు కాలేజీలపై ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. అదనంగా వసూలు చేసిన ఫీజులను కూడా తిరిగి ఇచ్చేయాలని పేర్కొంది. ఫ్యాకల్టీ సర్టిఫికెట్లు ఇచ్చేయాలని తెలిపింది.

News November 5, 2025

ఇతిహాసాలు క్విజ్ – 57

image

1. శబరి ఏ ఆశ్రమంలో రాముడి కోసం ఎదురుచూసింది?
2. విశ్వామిత్రుడి శిష్యులలో ‘శతానందుడు’ ఎవరి పుత్రుడు?
3. కుబేరుడు రాజధాని నగరం పేరు ఏంటి?
4. నారదుడు ఏ వాయిద్యంతో ప్రసిద్ధి చెందాడు?
5. కాలానికి అధిపతి ఎవరు?
☞ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>