News March 22, 2024

దేశంలో రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నాయంటే?

image

దేశంలో దాదాపు 2600కు పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇందులో గుర్తింపు లేని పార్టీలే (2,597) ఎక్కువ. 57 స్టేట్ పార్టీలు, 6 జాతీయ పార్టీలు (BJP, కాంగ్రెస్, BSP, CPM, నేషనల్ పీపుల్స్ పార్టీ, AAP) ఉన్నాయి. 1951లో తొలి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన వాటిలో 14 జాతీయ పార్టీలుండగా, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో 6 మాత్రమే పోటీలో ఉండనున్నాయి. అప్పటితో పోలిస్తే దేశంలో నేషనల్ పార్టీల సంఖ్య తగ్గింది.

Similar News

News November 2, 2025

కొండచరియలు విరిగిపడి 21మంది మృతి

image

భారీ వర్షాలు కెన్యాలో తీవ్ర విషాదాన్ని నింపాయి. రిఫ్ట్ వ్యాలీలో కొండచరియలు విరిగిపడి 21మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30మంది గల్లంతు అయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వెస్ట్రన్ కెన్యాలో వరదలొచ్చి రోడ్లు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లు ధ్వంసమై పలువురు నిరాశ్రయులు అయ్యారు.

News November 2, 2025

చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేస్తే..?

image

శివుడు అభిషేక ప్రియుడు. అందుకే నీటితో అభిషేకం చేసినా ఆయన అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతుంటారు. అయితే చెరకు రసంతో శివుడిని అభిషేకం చేయడం మరింత పుణ్యమని అంటున్నారు. ‘చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యలు తొలగి, ధనవృద్ధి కలుగుతుంది. ఈ అభిషేకం ద్వారా చెరుకు లాగే భక్తుల జీవితం కూడా మధురంగా మారుతుందని నమ్మకం. అప్పుల బాధలు తొలగి, ధనానికి లోటు లేకుండా జీవించడానికి ఈ అభిషేకం చేయాలి’ అంటున్నారు.

News November 2, 2025

అడుగులోనే అరక విరిగిందట

image

పొలం దున్నడానికి ఉపయోగించే ముఖ్యమైన వ్యవసాయ పనిముట్టు అరక. పొలం దున్నడం మొదలుపెట్టి, ఒక అడుగు వేయకముందే లేదా మొదటి అడుగులోనే, ప్రధానమైన పనిముట్టు అయిన అరక విరిగిపోతే పని ముందుకు సాగదు. ఏదైనా ఒక కార్యాన్ని లేదా ప్రయత్నాన్ని ప్రారంభించిన తక్షణమే ఊహించని సమస్య లేదా అవాంతరం ఎదురై మొత్తం ప్రణాళిక లేదా ప్రయత్నం విఫలమైనప్పుడు ఈ సామెత ఉపయోగిస్తారు.