News May 4, 2024
‘దోస్త్’.. ఎన్ని సీట్లు ఉన్నాయంటే?

TG: రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు <<13172421>>‘దోస్త్’<<>> నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీని కోసం ఆన్‌లైన్‌లో రూ.200 ఫీజు చెల్లించి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించింది. మొత్తం 1,066 డిగ్రీ కళాశాలల్లో 4,49,449 సీట్లు భర్తీ చేయనుంది. విద్యార్థులు https://dost.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Similar News
News March 15, 2026
చంద్రబాబుకు అల్లు అర్జున్ థాంక్స్

AP సీఎం చంద్రబాబు నాయుడికి అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. శిరీష్, నయనిక దంపతులను <<19384357>>ఆశీర్వదించడానికి<<>> శనివారం అల్లు ఇంటికి చంద్రబాబు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ టైమ్‌లో విదేశాల్లో ఉన్న ఐకాన్ స్టార్.. చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని ఆయన Xలో పోస్ట్ చేసి సీఎంకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు.
News March 15, 2026
సిలిండర్ డోమ్ ఆకారంలోనే ఎందుకు?

LPG గ్యాస్‌ను సిలిండర్‌లో చాలా ఎక్కువ ఒత్తిడి వద్ద నింపుతారు. చతురస్రం లేదా దీర్ఘచతురస్ర ఆకారంలో ఉంటే మూలల వద్ద ఒత్తిడి ఎక్కువై పేలిపోయే ప్రమాదం ఉంటుంది. డోమ్ ఆకారంలో ఒత్తిడి అన్ని వైపులా సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అలాగే సిలిండర్లను దొర్లించడం సులభం అవుతుంది. కార్మికులు మోయాల్సిన బాధ తప్పుతుంది. పూర్తిగా గుండ్రంగా ఉంటే ఒకచోట నిలపడం కష్టం. తయారీ ఖర్చు కూడా తక్కువ.
News March 15, 2026
రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. కేసీఆర్ వస్తారా?

TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ శివ్ ప్రతాప్ ప్రసంగిస్తారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 20న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ చర్చలతో పాటు, మూసీ ప్రాజెక్టు, సింగరేణి బొగ్గు కుంభకోణంపై వాడీవేడి చర్చలకు ఆస్కారం ఉంది. సభకు KCR హాజరవడంపై క్లారిటీ లేదు. గతంలో సమావేశాల తొలి రోజున మాత్రమే BRS చీఫ్ హాజరయ్యేవారు.


