News March 16, 2024
ఈ సారి ఎలక్షన్స్ ఎన్ని దశలో?

ఇవాళ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. గతంలో ఎలక్షన్స్ను దశల వారీగా నిర్వహించారు. 2004లో 4, 2009లో 5, 2014లో 9, 2019లో 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. దీంతో ఈ సారి ఎన్ని దశల్లో ఎలక్షన్స్ నిర్వహిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికలకు మార్చి 10న షెడ్యూల్ విడుదల కాగా.. ఈ సారి ఆరు రోజులు ఆలస్యంగా వస్తుండడం గమనార్హం.
Similar News
News October 29, 2025
EPFO వేతన పరిమితి త్వరలో రూ.25వేలకు పెంపు?

EPFO వేతన పరిమితిని నెలకు ₹15,000 నుంచి ₹25,000కు పెంచే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం బేసిక్ పే గరిష్ఠంగా ₹15వేల వరకు ఉన్న ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు మాత్రమే దీని పరిధిలోకి వస్తున్నారు. వారికి EPF, ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) అమలవుతున్నాయి. ఇప్పుడు ఈ పరిమితిని ₹25వేలకు పెంచే విషయంపై త్వరలో జరిగే EPFO సెంట్రల్ బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
News October 29, 2025
గుమ్మంపై ఎందుకు కూర్చోకూడదు?

ఇంటి గుమ్మం, మెట్లపై కూర్చోవడం అరిష్టమని పండితులు చెబుతున్నారు. ఇది లక్ష్మీదేవిని ఆహ్వానించే మార్గాన్ని అడ్డుకున్నట్టు అవుతుందని అంటున్నారు. ‘గడపను మనం దైవసమానంగా భావిస్తాం. అందుకే పర్వదినాల్లో అలంకరిస్తాం. అలాంటి దైవసమానమైన గడపపై కూర్చుంటే ఆ దైవాన్ని అవమానించినట్లే. సైన్స్ పరంగా.. ఇంట్లో నుంచి బయటకి వెళ్లే బ్యాక్టీరియాను, నెగెటివ్ ఎనర్జీని వెళ్లకుండా అడ్డుకున్నట్లు అవుతుంది’ అని అంటున్నారు.
News October 29, 2025
BIG ALERT: ఇవాళ అతిభారీ వర్షాలు

AP: మొంథా తీవ్ర తుఫానుతో రాష్ట్రంలో ఇవాళ అతిభారీ వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, NTR, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.


