News April 17, 2025

IPLలో ఎన్ని సూపర్ ఓవర్‌లు జరిగాయంటే?

image

IPL: RRతో జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్‌లో <<16123764>>DC<<>> విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. అయితే, IPL 18 సీజన్లలో ఇప్పటి వరకు 15 సార్లు మ్యాచులు టై అయ్యి సూపర్ ఓవర్లు(15) జరిగాయి. 2009లో తొలిసారి రాజస్థాన్, కోల్‌కతా గేమ్ టై కాగా, సూపర్ ఓవర్లో రాజస్థాన్ గెలిచింది. నిన్నటి మ్యాచ్‌కు ముందు 2021లో ఢిల్లీ, SRH మధ్య S.O. జరిగింది. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఓ మ్యాచ్ ఓవర్ వరకు వెళ్లి IPL ఫ్యాన్స్‌కు మజా అందించింది.

Similar News

News April 19, 2025

మే 2న కేదార్‌నాథ్, 4న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్

image

చార్‌ధామ్ యాత్రలో ముఖ్యమైన కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని మే 2న తెరవనున్నట్లు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధికార ప్రతినిధి తెలిపారు. అలాగే, మే 4న బద్రీనాథ్ ఆలయాన్ని ఓపెన్ చేస్తామన్నారు. వీటితో పాటు రెండో కేదార్‌గా పిలవబడే మద్‌మహేశ్వర ఆలయాన్ని మే 21న, మూడో కేదార్ తుంగ గుడిని మే 2న తెరుస్తామని వివరించారు. విపరీతమైన మంచు వల్ల వేసవిలో కొన్ని రోజుల పాటే ఈ ఆలయాలు తెరిచి ఉంటాయి.

News April 19, 2025

RBI వద్ద 879 టన్నుల పసిడి నిల్వలు

image

ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి RBI వద్ద 879 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. దీని విలువ రూ.6.83 లక్షల కోట్లు అని అంచనా. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల నేపథ్యంలో పసిడి నిల్వలు పెంచుకునేందుకు RBI ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా 2024లో ఏకంగా 72.6 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులన్నీ పసిడి నిల్వలు పెంచుకుంటున్న క్రమంలో RBI కూడా అదే కోవలో పయనిస్తోంది.

News April 19, 2025

JEE టాప్-10 ర్యాంకర్స్ వీరే

image

JEE ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఇందులో రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు తొలి రెండు ర్యాంకుల్లో నిలిచారు. మూడు, నాలుగు ర్యాంకులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన విద్యార్థులు కైవసం చేసుకున్నారు. 1.MD అనాస్, 2.ఆయుష్ సింఘాల్(RJ), 3.అర్చిష్మాన్ నాండీ, 4.దేవదత్త మాఝీ(WB), 5.రవి చౌదరి(MH), 6.లక్ష్య శర్మ(RJ), 7.కుషాగ్ర గుప్తా(KN), 8.హర్ష్ ఏ గుప్తా(TG), 9.ఆదిత్ ప్రకాశ్ భగాడే(GJ), 10.దక్ష్ (DL).

error: Content is protected !!