News March 30, 2024

తులసి గింజలతో ఎన్ని ఉపయోగాలో!

image

ఆధ్యాత్మికపరంగానే కాక వైద్యపరంగానూ తులసి మొక్కకు చాలా ప్రాశస్త్యం ఉంది. ప్రధానంగా తులసి గింజల వలన చాలా ఉపయోగాలున్నాయట. ‘జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వ్యాధులు తులసి ఆకులతో నయమవుతాయి. తులసి గింజల్లో ఫైబర్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు లభిస్తాయి. జీర్ణశక్తి మెరుగుదల, ఎసిడిటీ, గ్యాస్‌ నియంత్రణ వంటి ఫలితాలు ఉంటాయి. మలబద్ధకానికి సహజసిద్ధమైన ఔషధం తులసి గింజలు’ అంటున్నారు నిపుణులు.

Similar News

News December 4, 2025

ఎల్లుండి నుంచి APP పరీక్షల హాల్ టికెట్లు

image

TG: 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టుల పరీక్షా హాల్ టికెట్లను ఈ నెల 6వ తేదీ ఉ.8గం. నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని TSLPRB ప్రకటించింది. 13వ తేదీ రాత్రి 12గం. వరకు సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈనెల 14న రాత పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఉ.10గం. నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1(ఆబ్జెక్టివ్), మధ్యాహ్నం 2.30 నుంచి 5.30గం. వరకు పేపర్-2(డిస్క్రిప్టివ్) ఉంటాయని తెలిపింది.

News December 4, 2025

APPLY NOW: టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు

image

<>ఎయిమ్స్<<>> గోరఖ్‌పూర్‌లో 7 టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా(MLT, DMLT, రేడియోగ్రఫీ, ఇమేజ్ టెక్నాలజీ), ఇంటర్, డిగ్రీ(BCA, IT, సోషియాలజీ, సోషల్ వర్క్), పీజీ(పబ్లిక్ హెల్త్ & రిలేటెడ్ సబ్జెక్ట్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డిసెంబర్ 8న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://aiimsgorakhpur.edu.in/

News December 4, 2025

మొక్కజొన్న కోత, నిల్వలో తేమ ముఖ్యం

image

మొక్కజొన్న పంట కోత సమయంలో తేమ కీలకమని, రైతులు సరైన సమయంలో కోత చేపడితే మంచి ధర పొందవచ్చంటున్నారు వ్యవసాయ నిపుణులు. గింజల్లో 25 నుంచి 30 శాతం తేమ ఉన్నప్పుడు కోత చేపట్టి కండెలను 2-3 రోజులు ఎండలో ఆరబెట్టాలి. సుమారు 15 శాతం తేమ ఉన్నప్పుడు నూర్పిడి యంత్రాల సహాయంతో నూర్పిడి చేసి గింజలను ఎండబెట్టాలి. గోదాములలో నిల్వ చేయాలనుకుంటే సుమారు 10 శాతం తేమ ఉన్న గింజలను నిల్వచేయాలని నిపుణులు సూచిస్తున్నారు.