News March 28, 2024

తెలంగాణలో ఎంతమంది ఓటర్లంటే..

image

TS: రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.3 కోట్లుగా ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. వీరిలో 1,65,95,896మంది మహిళలు, 1,64,14,693మంది పురుషులు, 2729మంది ఇతరులు ఉన్నారని వెల్లడించారు. ఇక తొలితరం ఓటర్లు 8,72,116మంది, 85ఏళ్లు దాటినవారు 1,93,489మంది, దివ్యాంగులు 5,26,286మంది, సర్వీసు ఓటర్లు 15,472మంది, ఎన్నారై ఓటర్లు 3409మంది ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News March 29, 2026

హైదరాబాద్‌ను మించిన రాజధానిగా అమరావతి: CBN

image

AP: స్థానిక సంస్థల్లో మహిళలకు ఏనాడో రిజర్వేషన్లు కల్పించిన పార్టీ టీడీపీ అని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ‘సామాన్యులను చట్టసభలకు పంపిన పార్టీ టీడీపీ. మేం తెచ్చిన విద్యుత్ సంస్కరణలు అనేక రాష్ట్రాలకు మోడల్‌గా మారాయి. ఇక మూడు రాజధానుల మూడు ముక్కలాటలు ఉండవు. హైదరాబాద్‌ను మించిన రాజధానిగా అమరావతి మారుతుంది’ అని తెలిపారు.

News March 29, 2026

కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలి.. అసెంబ్లీలో డిమాండ్!

image

TG: అసెంబ్లీలో కడియం శ్రీహరి పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారని మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలు ఆరోపించారు. కడియం మాట్లాడుతుండగా కౌశిక్ గన్‌తో కాల్చి పడేస్తానంటూ చేయితో సైగలు చేశారని మండిపడ్డారు. ఆయన్ను ఎమ్మెల్యేగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దళితుల పట్ల బీఆర్ఎస్ అగౌరవంగా వ్యవహరిస్తోందని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

News March 29, 2026

ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిల ప్రైవేట్ ఫొటోలు!

image

ఇన్‌స్టాగ్రామ్‌లో అడల్ట్ కంటెంట్ ఎక్కువైందని పలువురు ఆరోపిస్తున్నారు. కొందరు యువతులు ఇన్‌స్టాలోని సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ (నెలకు రూ.89-890) ద్వారా యూజర్లకు ప్రైవేట్ ఫొటోలు షేర్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని పేర్కొంటున్నారు. మెటా యాజమాన్యం న్యూడ్ ఫొటోలను నియంత్రిస్తున్నప్పటికీ కొన్నింటిని అడ్డుకోలేకపోతోందని SMలో పోస్టులు చేస్తున్నారు. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందంటున్నారు. దీనిపై మీ COMMENT?