News May 10, 2024
ఒక ఈవీఎంలో ఎన్ని ఓట్లు వేయొచ్చంటే?

ప్రస్తుతం దేశంలో రెండు వెర్షన్‌ల ఈవీఎంలను వినియోగిస్తున్నారు. పాత వెర్షన్ EVM (2000-05 మోడల్)లో గరిష్ఠంగా 3,840 ఓట్లు నిల్వచేయొచ్చు. అదే సమయంలో కొత్త వెర్షన్ EVM (2006 నుంచి వస్తున్న మోడల్)లో గరిష్ఠంగా 2000 ఓట్లను నిల్వ చేయొచ్చు. ఈసీ ప్రకారం కంట్రోల్ యూనిట్‌లో ఎన్నికల ఫలితాలు 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
Similar News
News December 18, 2025
అమెజాన్‌లో మరోసారి ఉద్యోగాల కోత

అమెజాన్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది. లక్సెంబర్గ్‌లోని యూరోపియన్ హెడ్‌క్వార్టర్స్‌లో 370 జాబ్స్‌కు కోత పెట్టనుంది. అక్కడ ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించడం కంపెనీ చరిత్రలో తొలిసారి. AI వినియోగంపై దృష్టిపెట్టిన అమెజాన్ 14 వేలకు పైగా ఉద్యోగులను తొలగిస్తామని అక్టోబర్‌లో ప్రకటించింది. లక్సెంబర్గ్‌లో తొలుత 470 మందిని తొలగించాలని కంపెనీ నిర్ణయించింది. అయితే స్టాఫ్‌తో చర్చల తర్వాత ఆ సంఖ్యను తగ్గించింది.
News December 18, 2025
చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు

AP: సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు వచ్చినట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ‘మా కుటుంబానికి, ఏపీకి గర్వకారణమైన క్షణం. సీఎం చంద్రబాబును బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ఎకనమిక్ టైమ్స్ సంస్థ సత్కరించింది. భారతదేశ సంస్కరణల ప్రయాణాన్ని ఇంత స్పష్టత, ధైర్యం, స్థిరత్వంతో తీర్చిదిద్దిన నాయకులు కొందరే. ఈ అవార్డు ఆయన సంస్కరణలు, వేగం, పాలనపై నమ్మకానికి దక్కిన గౌరవం’ అని ట్వీట్ చేశారు.
News December 18, 2025
అంటే.. ఏంటి?: Espionage..

గూఢచర్యం (నిఘా)తో రహస్య, ముఖ్య సమాచారం సేకరించడాన్ని ఇంగ్లిష్‌లో Espionage అంటారు. ఇందుకోసం వ్యక్తులు లేదా జంతువులు లేదా ఇతర ప్రాణులు, డివైజ్‌లను వ్యక్తులు/సంస్థలు వాడుతాయి. ఈ పదం ఫ్రెంచ్ భాషలోని Espionnage (Spy) నుంచి పుట్టింది.
తరచుగా వాడే పర్యాయ పదాలు: Spying, Surveillance
– రోజూ 12pmకు ‘అంటే.. ఏంటి?’లో ఓ ఇంగ్లిష్ పదానికి అర్థం, పద పుట్టుక వంటి విషయాలను తెలుసుకుందాం.
Share it


