News May 13, 2024

ఈవీఎంలలో డేటా ఎన్నేళ్లు ఉంటుందంటే?

image

ఈవీఎం వ్యవస్థను అత్యంత సురక్షితమైన, కచ్చితమైన ఓటింగ్ ప్రక్రియగా ఈసీ పేర్కొంటుంది. ప్రస్తుతం 2006 తర్వాత వచ్చిన EVM మోడల్స్‌ను వినియోగిస్తున్నారు. ఒక్క ఈవీఎంలో 2వేల ఓట్ల వరకు నమోదు చేయొచ్చు. ఈసీఐఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ సంయుక్తంగా రూపొందించిన ఈ మెషీన్లు 15 ఏళ్ల వరకు పనిచేయగలవు. ఇందులోని కంట్రోల్ యూనిట్ మనం వేసిన ఓట్లకు సంబంధించిన డేటాను 10ఏళ్ల వరకు స్టోర్ చేయగలదు.

Similar News

News February 7, 2026

శుభవార్త చెప్పిన ప్రభుత్వం

image

APలోని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్థిక ఇబ్బందులతో తమ వాటా డబ్బులు చెల్లించలేక ఇళ్లు కట్టుకోలేని వారికి రుణాలు సమకూర్చనుంది. ఒక్కొక్కరికి ₹3.65 లక్షల చొప్పున 39వేల మందికి ₹1,423 కోట్లు అందించనుంది. ఈ రుణాన్ని 10.2-11.5% వడ్డీతో 15-20 ఏళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ ఏడాది జూన్‌కు 2.61 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

News February 7, 2026

మెత్తబడ్డ PCB.. T20 WCలో భారత్-పాక్ పోరు పక్కా?

image

భారత్‌తో మ్యాచ్‌ బాయ్‌కాట్ విషయంలో పాక్ క్రికెట్ బోర్డు కాస్త మెత్తబడ్డట్లు కనిపిస్తోంది. రూట్ మార్చి ICCతో చర్చలు ప్రారంభించింది. భారీ జరిమానాలు, బైలేటరల్ సిరీస్‌లపై నిషేధం వంటి గట్టి వార్నింగ్‌లు రావడంతోనే పాక్ దారికొచ్చినట్లు తెలుస్తోంది. శ్రీలంక బోర్డు కూడా ఆర్థిక నష్టాల దృష్ట్యా ఆడమని కోరింది. దీంతో వచ్చే ఆదివారం కొలంబోలో జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ పోరుపై మళ్లీ ఆశలు చిగురించాయి.

News February 7, 2026

టీమ్ ఇండియాకు షాక్.. కుప్పకూలిన టాపార్డర్

image

టీ20 వరల్డ్ కప్: అమెరికాతో మ్యాచ్‌లో టీమ్ ఇండియా టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ గోల్డెన్ డక్ అయ్యాక ఇషాన్, తిలక్ కాస్త ఫామ్‌లో కనిపించారు. కానీ కాసేపటికే ఇషాన్(20) క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. రెండు బంతుల తేడాతోనే తిలక్(25) కూడా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. శివమ్ దూబే కూడా గోల్డెన్ డక్ అయ్యారు. 6వ ఓవర్లో 3 వికెట్లు పడ్డాయి. భారత్ స్కోర్ 7 ఓవర్లలో 49/4గా ఉంది.