News August 4, 2024

రాయన్ మూవీ కలెక్షన్లు ఎంతంటే?

image

ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాయన్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూళ్లు చేసింది. ఒక్క భారత్‌లోనే రూ.72.75 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. గతంలో ధనుష్ నటించిన ‘తిరు’, ‘సార్’ సినిమాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు చేశాయి. ప్రస్తుతం రాయన్ ఇదే జోరును కొనసాగిస్తే ధనుష్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచే అవకాశముంది.

Similar News

News January 3, 2026

ఏ పంటలకు చెదపురుగుల బెడద ఎక్కువ?

image

కలప సంబంధిత వృక్ష జాతులు, ధాన్యపు పంటలు, మామిడి, కొబ్బరి, కోకో, ద్రాక్ష, చెరకు తోటలను చెదపురుగులు ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. పంట నారుమడి దశ నుంచి పూర్తిగా ఎదిగే వరకూ చెదపురుగుల ముప్పు ఎక్కువే. ఇవి నేలలో సొరంగాలు చేసుకొని, నేలపై పుట్టలు పెట్టి జీవిస్తాయి. ఇవి మొక్కల వేర్లను, భూమికి దగ్గరగా ఉండే కాండపు భాగాలను, పెద్ద వృక్షాల బెరడును తినడం వల్ల మొక్కలు, చెట్లు చనిపోయి నష్టం కలుగుతుంది.

News January 3, 2026

నవగ్రహ ప్రదక్షిణలో తప్పక పాటించాల్సిన నియమాలు

image

నవ గ్రహ ప్రదక్షిణలో విగ్రహాలను అస్సలు తాకకూడదని పండితులు చెబుతున్నారు. ప్రదక్షిణ పూర్తయ్యాక వాటికి వీపు చూపకుండా గౌరవంగా వెనుకకు రావాలని అంటున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు నవ గ్రహాలకు ప్రదక్షిణ చేయడం మంచిది కాదని, శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడే నియమబద్ధంగా ప్రదక్షిణలు చేయాలని అంటున్నారు. సంపూర్ణ అనుగ్రహం కోసం ఈ నియమాలు కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు.

News January 3, 2026

THDCలో 100 పోస్టులకు నోటిఫికేషన్

image

తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా(THDC)100 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ITI, BE, BTech, BBA అర్హతగల వారు జనవరి 31వరకు www.apprenticeshipindia.org పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తును, డాక్యుమెంట్స్‌ను పోస్ట్ చేయాలి. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. https://thdc.co.in