News July 30, 2024

మను భాకర్ శిక్షణకు పెట్టిన ఖర్చు ఎంతంటే..

image

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించి కోట్లాదిమంది హృదయాల్ని గెలుచుకున్నారు మను భాకర్. మరి ఆమె శిక్షణకు ఎంత ఖర్చయింది? కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ ప్రశ్నకు జవాబిచ్చారు. ‘పాఠశాలల స్థాయి నుంచి నైపుణ్యాలను గుర్తించి తగిన శిక్షణ అందించే ఖేలో ఇండియాలో మను కూడా ఉన్నారు. ఆమె కోసం కేంద్రం రూ.2 కోట్లు ఖర్చు పెట్టింది. శిక్షణ కోసం జర్మనీ, స్విట్జర్లాండ్‌కూ పంపించాం’ అని తెలిపారు.

Similar News

News April 2, 2026

బీజేపీతో జాగ్రత్త.. TDPకి ఆప్ ఎంపీ హెచ్చరిక

image

AP: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక పార్టీలను మోసం చేసిన చరిత్ర బీజేపీదని, ఆ పార్టీ విషయంలో టీడీపీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పుడు అధికారం చంద్రబాబు చేతుల్లోనే ఉందని, కేంద్రం నుంచి ఎంత రాబట్టుకోవాలో అంత రాబట్టుకోవాలని సూచించారు.

News April 2, 2026

ఆప్ డిప్యూటీ నేతగా రాఘవ్ చద్దా తొలగింపు!

image

రాజ్యసభలో తమ పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాఘవ్ చద్దాను ఆప్ తొలగించింది. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్‌(పంజాబ్)ను నియమించినట్లు రాజ్యసభ సెక్రటేరియట్‌కు లేఖ రాసింది. పార్లమెంటులో మాట్లాడేందుకు ఆయనకు సమయం ఇవ్వొద్దని కోరింది. పార్టీకి, చద్దాకు మధ్య విభేదాలు వచ్చాయనే వార్తల నేపథ్యంలో ఆప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇటీవల వరుసగా ప్రజా సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతూ చద్దా వార్తల్లో నిలిచారు.

News April 2, 2026

ఈ సాయంత్రం దీపాలు వెలిగిద్దాం: లోకేశ్

image

AP: అమరావతికి పట్టిన గ్రహణం వీడిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించి ఈ చారిత్రక విజయాన్ని వేడుకలా చేసుకుందామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ‘మన రాజధాని.. మన గౌరవం’ అని ట్వీట్ చేశారు.