News August 14, 2024
ఏ బ్యాంకు ఎంత ఛార్జ్ చేస్తుంది?(2/2)

యాక్సిస్ బ్యాంకులో మెట్రో, పట్టణ ప్రాంతాల్లో ₹600 నుంచి ₹50, సెమీ అర్బన్ ఏరియాల్లో ₹300 నుంచి ₹50, గ్రామీణ ప్రాంతాల్లో ₹150 నుంచి ₹75 మధ్య ఉంది. ఎస్బీఐ, YES బ్యాంకులు ఈ ఛార్జీలు వేయడం లేదు. మినిమమ్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ప్రభుత్వ బ్యాంకులు ₹8,495 కోట్లు వసూలు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇందులో పీఎన్బీ గత ఐదేళ్లలో అత్యధికంగా ₹1,538 కోట్లు ఛార్జ్ చేసింది.
Similar News
News November 15, 2025
బహిరంగ ప్రకటన లేకుండా గిఫ్ట్ డీడ్.. పరకామణిలో చోరీపై సీఐడీ

AP: పరకామణిలో చోరీ కేసులో నిందితుడు రవికుమార్ టీటీడీకి ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌పై బహిరంగ ప్రకటన ఎందుకు ఇవ్వలేదని జేఈవో వీరబ్రహ్మంను సీఐడీ ప్రశ్నించింది. టీటీడీకి రూ.14.43 కోట్ల విలువైన ఆస్తులను నిందితుడు గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చారు. ఇష్టప్రకారమే ఇచ్చారా? ఒత్తిడి చేశారా అని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకున్నప్పుడు ఎన్ని నోట్లు దొరికాయి, ఆరోజు లెక్కింపునకు వచ్చిన భక్తుల వివరాలు సేకరిస్తున్నారు.
News November 15, 2025
స్వామి పుష్కరిణి అని పేరెందుకు వచ్చింది?

తిరుమలలోని స్వామి పుష్కరిణికి ఆ పేరు రావడానికి ఓ పురాణ కథనం ప్రాచుర్యంలో ఉంది. వేంకటాచలంలో ఉన్న మూడు కోట్ల తీర్థాలన్నింటికీ ఈ పుష్కరిణియే అవతార స్థానం. లోకంలోని తీర్థాలన్నింటిలోనూ దీన్ని స్వామి వంటిదిగా పరిగణిస్తారు. వరాహ, వామన పురాణాల ప్రకారం.. తనలో స్నానం చేసిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదించగల శక్తి, పవిత్రతను అందిస్తుందట. అందుకే దీనికి స్వామి పుష్కరిణి అనే పేరు స్థిరపడింది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 15, 2025
APPLY NOW: CWCలో 22 పోస్టులు

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్(CWC)లో 22 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://cwceportal.com/


