News January 6, 2025
రాష్ట్రంలోని ఆలయాల్లో ఎంత బంగారం ఉందంటే?
TG: రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో కలిపి 1,048 కేజీల బంగారం, 38,783 కేజీల వెండి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా వేములవాడ రాజన్న ఆలయానికి 97kgs బంగారం సమకూరిందని తెలిపారు. తర్వాతి స్థానాల్లో భద్రాచలం (67), యాదగిరి గుట్ట (61) ఉన్నాయి. ఈ బంగారం ఆయా ఆలయాల పరిధిలోనే ఉంటుందని, కానుకల రూపంలో వచ్చిన బంగారాన్ని మాత్రమే ఆలయ అవసరాల కోసం ప్రభుత్వ అనుమతితో కరిగిస్తారని అధికారులు పేర్కొన్నారు.
Similar News
News January 7, 2025
మేము ఎవరినీ టార్గెట్ చేయట్లేదు: మంత్రి పొంగులేటి
TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరినీ టార్గెట్ చేయడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి తప్పు చేయకపోతే కేటీఆర్ కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. తప్పులు చేశారు కాబట్టే అన్నీ బయటపడుతున్నాయని చెప్పారు. జైలుకు వెళ్తే సీఎం అవుతారని అనుకుంటే కేటీఆర్ కంటే కవిత ముందు ఉంటారని చెప్పారు. కొత్త ఏడాదిలో కేటీఆర్‌కు స్పిరిట్ పెరిగిందని సెటైర్లు వేశారు.
News January 7, 2025
3వ ప్లేస్‌కు పడిపోయిన భారత్
ఆస్ట్రేలియా చేతిలో BGT కోల్పోయిన భారత జట్టుకు మరో షాక్ తగిలింది. ICC తాజా ర్యాంకింగ్స్‌లో 3వ స్థానానికి మన టీమ్ పడిపోయింది. 2016 తర్వాత తొలిసారి భారత్ 3వ ప్లేస్‌కు చేరుకుంది. పాకిస్థాన్‌తో రెండో టెస్టులో గెలిచి, సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసి సౌతాఫ్రికా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరింది. BGT గెలిచిన ఆసీస్ జట్టు టాప్‌లో కొనసాగుతోంది.
News January 7, 2025
మార్చి నెలాఖరు కల్లా DPRలు రెడీ చేయాలి: రేవంత్
TG: జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు సహా పలు అంశాలపై వారితో చర్చిస్తున్నారు. మార్చి నెలాఖరు కల్లా కొత్త కారిడార్ల DPRలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ, శామీర్‌పేట్, మేడ్చల్ వరకు మెట్రో కారిడార్లకు ఏప్రిల్ నాటికి టెండర్లు పిలిచేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.