News January 7, 2025
నిన్నటితో పోలిస్తే బంగారం ఎంత పెరిగిందంటే..

బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. డాలర్ విలువ పెరుగుతుండటమే ఇందుకు కారణం. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.51 పెరిగి రూ.81,789గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.47 ఎగిసి రూ.74,973 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1000 పెరిగి రూ.1,00,000 వద్ద ఉంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.70 ఎగిసి రూ.25,740 వద్ద ట్రేడవుతోంది. మరికొన్ని రోజులు ధరలు ఇలాగే కొనసాగొచ్చని నిపుణులు చెప్తున్నారు.
Similar News
News November 24, 2025
భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 156 పోస్టులు

HYDలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (<
News November 24, 2025
దీపాల కింద కూర్చుని చదువుకున్నా: CJI

ఓ చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన తాను <<18373221>>CJI<<>> అవుతానని ఎప్పుడూ అనుకోలేదని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. అప్పట్లో న్యాయవ్యవస్థ అంటే ఏంటో కూడా తెలియదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘మా ఊరికి విద్యుత్ సరఫరా సరిగ్గా ఉండేది కాదు. దీపాల కింద కూర్చుని చదువుకున్నా. లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు సీనియర్లు ఎంతో సాయం చేశారు. హైకోర్టుకెళ్లాక 5-6 ఏళ్లలోనే విజయవంతమైన లాయర్‌గా పేరు తెచ్చుకున్నా’ అని చెప్పారు.
News November 24, 2025
Free movies, Free downloads ప్రమాదకరం: సజ్జనార్

అనుమానాస్పద లింక్స్, ఫ్రీ మూవీ సైట్స్‌ను క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దని HYD CP సజ్జనార్ హెచ్చరించారు. అలాంటి వాటిపై క్లిక్ చేస్తే అకౌంట్స్ హ్యాక్ చేసి డేటాను దొంగిలిస్తారని, తర్వాత బ్లాక్‌మెయిల్‌కు దిగుతారని పేర్కొన్నారు. ‘Free movies, Free downloads అంటూ ఉచితమనిపించే కంటెంట్ ప్రమాదకరం. ఇలాంటి ఫేక్ సైట్లు, యాప్స్ ఎప్పుడూ క్లిక్ చేయొద్దు. స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్ పెట్టుకోండి’అని సూచించారు.


