News March 25, 2025

తెలంగాణ రాష్ట్ర అప్పు ఎంతంటే?

image

తెలంగాణకు ₹4,42,298 కోట్ల అప్పులు ఉన్నాయని కేంద్రం లోక్ సభలో వెల్లడించింది. ఈ విషయంలో దేశంలో TG 24వ స్థానంలో ఉందని ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. అలాగే రాష్ట్రంలో గత 6 ఏళ్లలో 10,189 IT కంపెనీలు ప్రారంభమయ్యాయని కేంద్ర మంత్రి హర్ష మల్హోత్రా తెలిపారు. ఇదే సమయంలో 3,369 సంస్థలు మూతపడ్డాయని పేర్కొన్నారు. ఈ కంపెనీల ద్వారా గత ఐదేళ్లలో ₹14,865కోట్ల టర్నోవర్ జరిగిందని వివరించారు.

Similar News

News March 27, 2025

బ్యాంక్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్

image

బ్యాంక్ ఖాతాదారులు ఇకపై నలుగురు నామినీలను యాడ్ చేసుకునేలా కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఈమేరకు నిన్న బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లుకు రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. గతేడాది డిసెంబర్‌లోనే దీనికి లోక్‌సభలో గ్రీన్‌సిగ్నల్ లభించింది. అటు ఓ వ్యక్తి బ్యాంకులో ఉంచుకునేందుకు అనుమతించే మొత్తం నగదును ఈ బిల్లు ద్వారా రూ.5లక్షల నుంచి రూ.2 కోట్లకు కేంద్రం పెంచింది.

News March 27, 2025

సుంకాల విషయంలో ఆ దేశాల్లాగా భారత్‌ను ట్రీట్ చేయబోం: US

image

భారత్‌ను చైనా, మెక్సికో, కెనడాతో కలిపి చూడబోమని US వాణిజ్య అధికారులు స్పష్టం చేశారు. ఆ దేశాలతో కరెన్సీ అవకతవకలు, అక్రమ వలసలు, ఇతర భద్రతా విషయాలకు సంబంధించి తమకు సమస్యలు ఉన్నాయని తెలిపారు. INDతో కేవలం టారిఫ్ సమస్యలే ఉన్నాయని, వాటిని కూడా పరిష్కరించుకునేందుకు చర్చలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. కాగా INDతో సహా ఇతర దేశాలకు పరస్పర సుంకాలను అమలు చేస్తామని ట్రంప్ గతంలోనే ప్రకటించారు.

News March 27, 2025

3 నెలలకోసారి జాబ్ మేళాలు: సీఎం

image

AP: అన్ని నియోజకవర్గాల్లో ప్రతి 3, 6 నెలలకోసారైనా జాబ్ మేళాలు నిర్వహించాలని కలెక్టర్లను CM చంద్రబాబు ఆదేశించారు. స్కిల్ సెన్సస్ ఇంకా పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. యువతకు స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు ప్రతి జోన్‌కు ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీని నోడల్ ఏజెన్సీగా గుర్తించాలన్నారు. WFH విధానంలో వర్క్ చేసేందుకు రిజిస్టర్ చేసుకున్న వారికి ట్రైనింగ్ ప్రారంభించాలని సూచించారు.

error: Content is protected !!