News October 12, 2024

ఒక్కో కుటుంబంపై అప్పు ఎంతంటే?

image

TG: రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు ఉందని నాబార్డ్ 2021-22 సర్వే తెలిపింది. జాతీయ సగటు రూ.90,372గా ఉంది. అప్పుల్లో ఉన్న కుటుంబాల సంఖ్య 79% నుంచి 92శాతానికి పెరిగింది. ఇందులో జాతీయ సగటు 52%. ఇక దేశంలో అప్పుల్లో ఉన్న కుటుంబాల్లో తొలి 2 రాష్ట్రాలు TG(92%), AP(86%) కావడం గమనార్హం. మరోవైపు ఒక్కో కుటుంబంలో సగటు సభ్యుల సంఖ్య కూడా గతంతో పోలిస్తే 3.8 నుంచి 4.1కి పెరిగింది.

Similar News

News October 12, 2024

జానీ మాస్టర్‌పై రేప్ కేసు పెట్టిన యువతిపై యువకుడి ఫిర్యాదు

image

జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు పెట్టిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ తనను లైంగికంగా వేధించిందంటూ ఓ యువకుడు నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన మామ జానీ మాస్టర్‌తో కలిసి HYD, చెన్నైలలో షూటింగ్‌లకు వెళ్లినప్పుడు ఆమె లిఫ్ట్‌, రెస్ట్ రూమ్‌, లాడ్జిలో తనపై లైంగిక దాడి చేసి, నగ్న ఫొటోలు తీసి బెదిరించిందన్నాడు. అప్పుడు తాను మైనర్‌నని చెప్పాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు.

News October 12, 2024

‘డిగ్రీ’లో అడ్మిషన్లు అంతంతమాత్రమే

image

TG: రాష్ట్రంలో డిగ్రీ కోర్సులకు డిమాండ్ తగ్గుతోంది. ఈ ఏడాది 4.5 లక్షల సీట్లకు గాను 1.9 లక్షల సీట్లే భర్తీ అయినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా బీకామ్ లో 77 వేల మంది చేరినట్లు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ లో చేరేందుకు ఎక్కువగా ఆసక్తి చూపడమే సీట్లు నిండకపోవడానికి కారణమని చెబుతున్నారు. ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే ప్రభుత్వ కాలేజీల్లోనే అడ్మిషన్లు ఎక్కువ జరగడం గమనార్హం.

News October 12, 2024

ఢిల్లీకి పంత్ గుడ్ బై? ట్వీట్ వైరల్

image

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ చేసిన ట్వీట్ సరికొత్త చర్చకు దారితీసింది. ‘ఒకవేళ నేను ఐపీఎల్ వేలంలో పాల్గొంటే ఎవరైనా కొనుగోలు చేస్తారా లేదా? ఎంత ధర పలకవచ్చు?’ అని పంత్ Xలో ప్రశ్నించారు. దీంతో పంత్ ఢిల్లీని వీడుతారా? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఆయనను సీఎస్కే తీసుకుంటుందనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంత్ ట్వీట్‌ వెనుక ఉద్దేశం ఏంటో తెలియాల్సి ఉంది.