News March 5, 2025
‘ఇంకెంత కాలం సాగాలి?’.. తెలంగాణ స్పీకర్కు సుప్రీం నోటీసులు

TG: BRS నుంచి కాంగ్రెస్లో చేరిన MLAలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. స్పీకర్ వద్ద విచారణ ప్రక్రియ MLAల పదవీకాలం ముగిసేంత వరకూ సాగాలా? అని ప్రశ్నించింది. ఇలాగే జరిగితే ప్రజాస్వామ్యం ఏం కావాలని నిలదీసింది. దీనిపై వివరణ ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శి, EC, ప్రతివాదులందరికీ కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 25కి విచారణ వాయిదా వేసింది.
Similar News
News March 6, 2025
ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా

ఉత్తర తెలంగాణలో బీజేపీ పట్టు నిలుపుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4, నిజామాబాద్ జిల్లాలో 3 సీట్లు గెలిచింది. 2024 ఎంపీ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ సొంతం చేసుకుంది. తాజాగా ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు సైతం తన ఖాతాలో వేసుకుంది. దీన్ని బట్టి చూస్తే ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది.
News March 6, 2025
సీఎం ప్రచారం చేసినా దక్కని విజయం!

TG: KNR-MDK-NZB-ADB ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోవడం ఆ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. పార్టీ అధికారంలో ఉన్నా, సీఎం రేవంత్ ప్రచారం నిర్వహించినా సిట్టింగ్ స్థానంలో గెలవకపోవడంతో ఈ జిల్లాల్లో కాంగ్రెస్ హవా తగ్గిందా అనే చర్చ మొదలైంది. ఈ ఎన్నికలో గెలిచినా, ఓడినా తమకు పోయేదేం లేదని స్వయంగా రేవంత్ వ్యాఖ్యానించడమూ ఆ పార్టీ ఓటమికి కారణమైందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News March 5, 2025
సౌతాఫ్రికా ఓటమి.. ఫైనల్లో కివీస్తో భారత్ పోరు

భారత్తో CT ఫైనల్ ఆడే జట్టేదో తేలిపోయింది. మిల్లర్ సెంచరీతో అద్భుత పోరాటం చేసినా సెమీఫైనల్-2లో NZ చేతిలో SA 50పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ నెల 9న CT ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. కివీస్ నిర్దేశించిన 363 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన SA ఒత్తిడిని జయించలేక వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. చివర్లో మిల్లర్(100) 4 సిక్సులు, 10 ఫోర్లతో విధ్వంసం సృష్టించినా ఫలితం లేకపోయింది.