News October 5, 2025

వారానికి మటన్ ఎంత తింటే మంచిదంటే?

image

మటన్‌లో శరీరానికి కావాల్సిన 9 రకాల అమైనో ఆమ్లాలు, మినరల్స్, ఐరన్ ఉంటుంది. ఇవి శరీర నిర్మాణానికి, కండరాల మరమ్మతులకు దోహదపడతాయి. అయినా అతిగా తింటే ఆరోగ్య సమస్యలొస్తాయని వైద్యులు చెబుతున్నారు. ‘సాధారణ ప్రజలు వారానికి 100 గ్రా., శారీరక శ్రమ చేసేవాళ్లు 200 గ్రా. వరకు తినొచ్చు. అతిగా తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు, సరిగ్గా అరగక జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదముంది’ అని హెచ్చరిస్తున్నారు.

Similar News

News October 5, 2025

రాముడు పుట్టక ముందే ఆయన్ని కొలిచాడు

image

అగస్త్యుని శిష్యుడు సుతీక్ష్ణుడు. గురుదక్షిణగా అగస్త్యుడు, సుతీక్ష్ణుడ్ని శ్రీరాముడి దర్శనం కల్పించమని ఆదేశిస్తాడు. అప్పటికి రాముడింకా జన్మించడు. అయినా సుతీక్ష్ణుడు అడవిలోకి వెళ్లి ఆయన కోసం తపస్సు చేస్తాడు. ఆహారం తీసుకోడు. నీళ్లు కూడా ముట్టడు. ఆయన శరీరం ఎముకల గూడులా మారుతుంది. చివరికి రాముడు ఆయన ఆశ్రమానికి వెళ్లి ఆలింగనం ఇస్తాడు. అందుకే అసలైన భక్తికి సుతీక్ష్ణుడు నిదర్శనం అని అంటారు. <<-se>>#Bakthi<<>>

News October 5, 2025

చేపల పెంపకం.. ‘బయో సెక్యూరిటీ’తో అదనపు లాభం

image

‘బయో సెక్యూరిటీ’తో చేపల పెంపకంలో అదనపు లాభాలుంటాయి. సాధారణంగా మేతకు వచ్చే పశువులు చేపల చెరువులో నీటిని తాగడానికి వస్తుంటాయి. పాములు, పక్షులు కూడా చేపలను తినడానికి వస్తుంటాయి. వీటి నుంచి చేపలకు రక్షణ కోసం బయో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటే మంచిది. దీనికోసం చేపల చెరువు చుట్టూ గ్రీన్ క్లాత్, వల లేదా ఓ ఇనుప కంచెను ఏర్పాటు చేసుకోవాలి. ప్రకృతి విపత్తుల్లో కూడా దీని వల్ల చేపలకు తక్కువ నష్టం జరుగుతుంది.

News October 5, 2025

రాష్ట్రంలో 118ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

తెలంగాణలో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు దరఖాస్తు గడువును TG SLPRB పొడిగించింది. అభ్యర్థులు ఈనెల 11 సా. 5గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పాటు LLBలేదా BL డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. క్రిమినల్ కోర్టుల్లో కనీసం 3ఏళ్ల ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అయి ఉండాలి. వయసు 34ఏళ్లు మించరాదు. అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.tgprb.in