News April 13, 2025

మటన్‌ను ఎంత తినాలి?

image

నాన్‌వెజ్ ప్రియులు మటన్‌ను ఇష్టంగా తింటారు. అయితే, అందులో కొవ్వులు ఎక్కువ ఉండటం వల్ల తగిన మోతాదులోనే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి వారానికి గ్రా.300, శారీరక శ్రమ చేసేవారు గ్రా.500 తినొచ్చని చెబుతున్నారు. గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు గ్రా.100 మించి తినకూడదు. అలాగే, సరిగా ఉడకని మటన్ తింటే ఫుడ్ పాయిజన్ అవుతుంది. కొందరికి అజీర్తి ఏర్పడి విరేచనాలు అవుతాయి.

Similar News

News November 5, 2025

నేడు గిరి ప్రదక్షిణ చేస్తే..?

image

అరుణాచలంలోని అన్నామలై కొండను శివలింగంగా భావించి చేసే ప్రదక్షిణనే ‘గిరి ప్రదక్షిణ’ అంటారు. అయితే ఈ ప్రదక్షిణను కార్తీక పౌర్ణమి రోజున చేయడం వల్ల మరింత పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. 14KM ఉండే ఈ గిరి చుట్టూ చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేస్తే కోరిన కోర్కెలు నెరవేరి, ముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పున్నమి వెలుగులో ప్రదక్షిణ చేయడం శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు.

News November 5, 2025

త్వరలో పెన్షన్లపై తనిఖీలు

image

TG: రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే చేయూత పింఛన్ల పంపిణీపై సామాజిక తనిఖీలు చేసేందుకు సెర్ప్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ స్కీమ్‌కు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీవోలను ఆదేశించింది. ఈ మేరకు స్థానిక పంచాయతీ కార్యదర్శులు, మండల పింఛన్ ఇన్‌ఛార్జులకు సూచనలు ఇవ్వాలని పేర్కొంది. పెన్షన్ల పంపిణీ, చెల్లింపులో మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టంచేసింది.

News November 5, 2025

విమాన ప్రయాణికులకు శుభవార్త

image

విమాన టికెట్ల రద్దు అంశంపై ప్రయాణికులకు DGCA గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్లు బుక్ చేసుకున్న 48 గంటల్లోపు ఎలాంటి ఛార్జీ లేకుండా రద్దు చేసుకోవడం/ప్రయాణ తేదీని మార్చుకునే అవకాశాన్ని కల్పించింది. క్రెడిట్ కార్డు ద్వారా అయితే 7 రోజుల్లో, ట్రావెల్ ఏజెంట్/పోర్టల్ ద్వారా బుక్ చేసుకుంటే 21 పనిదినాల్లో రిఫండ్ అందుతుంది. దేశీయ విమానాల్లో ప్రయాణానికి 5D, ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లలో 15D లోపు ఈ సౌకర్యం వర్తించదు.